Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Chikkudukaya Vepudu : చిక్కుడుకాయ వేపుడును ఒక్క‌సారి ఇలా చేసి తినండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

D by D
October 14, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Chikkudukaya Vepudu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో చిక్కుడుకాయ‌లు కూడా ఒక‌టి. చిక్కుడుకాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చిక్కుడుకాయ‌ల‌తో మ‌నం ర‌క‌రకాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో చిక్కుడుకాయ వేపుడు కూడా ఒక‌టి. చిక్కుడుకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఈ చిక్కుడుకాయ వేపుడును మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రింత రుచిగా, అంద‌రికి న‌చ్చేలా చిక్కుడుకాయ వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చిక్కుడుకాయ వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు- ఒక టీ స్పూన్, ధ‌నియాలు -ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – పావు కప్పు, ఎండుమిర్చి – 5 లేదా 6, వెల్లుల్లి రెబ్బ‌లు- 6, చిక్కుడు కాయ‌లు – పావుకిలో, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావుటీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Chikkudukaya Vepudu recipe in telugu very tasty if you make like this
Chikkudukaya Vepudu

చిక్కుడుకాయ వేపుడు త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. త‌రువాత శ‌న‌గ‌పప్పు, ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, ప‌చ్చికొబ్బ‌రి ముక్క‌లు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవ‌న్నీ వేగిన త‌రువాత జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బ‌లు కూడా వేసి మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత చిక్కుడుకాయ‌ల‌ను నీటిలో వేసి త‌గినంత ఉప్పు వేసి మెత్త‌గా ఉడికించాలి. త‌రువాత వీటిని వ‌డ‌క‌ట్టి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉడికించిన చిక్కుడుకాయ‌లు వేసి క‌ల‌పాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, మిక్సీ ప‌ట్టుకున్న కారం వేసి క‌ల‌పాలి.

త‌రువాత మూత పెట్టి మ‌రో 3 నుండి 5 నిమిషాల పాటు వేయించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ వేపుడు త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో పాటు ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తిన‌వ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన చిక్కుడుకాయ వేపుడును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Chikkudukaya Vepudu
Previous Post

5 Foods For High BP : ఈ 5 ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. హైబీపీ ఎంత ఉన్నా దిగి వ‌స్తుంది..!

Next Post

Beans Kura : బీన్స్ కూర‌ను ఇలా చేయండి.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!

Related Posts

వినోదం

ఒకే కథతో వచ్చి ఆ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.. అవేంటంటే..?

June 3, 2025
lifestyle

భర్త భార్యకు అస్సలు చెప్పకూడని నాలుగు విషయాలు.. 1వది చాలా ఇంపార్టెంట్..!!

June 3, 2025
sports

టెస్ట్ క్రికెట్ ఆడే సమయంలో వైట్ జెర్సీని ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా..?

June 3, 2025
హెల్త్ టిప్స్

మీ ఆయుర్దాం పొడిగించుకోవాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

June 3, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో ప్ర‌ధానంగా క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

June 3, 2025
వైద్య విజ్ఞానం

త‌ల‌నొప్పి అస‌లు ఎన్ని ర‌కాలు.. అవి ఎందుకు వ‌స్తాయి.. ఏం చేయాలి..?

June 3, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!