Mugguru Monagallu : మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన హిట్ చిత్రాల్లో నటించారు. కొన్ని సినిమాల్లో ఆయన ద్విపాత్రాభినయం చేయగా.. ఒక సినిమాలో మూడు పాత్రల్లో కనిపించి అలరించారు. అదే ముగ్గురు మొనగాళ్లు మూవీ. ఇందులో చిరంజీవి మూడు భిన్నమైన పాత్రలు చేశారు. రౌడీగా, పోలీస్ ఆఫీసర్‌గా, డ్యాన్స్ మాస్టర్‌గా ఆయన అలరించారు. ఇక ఈ మూవీని ఆయన సోదరుడు నాగబాబు స్వయంగా నిర్మించడం విశేషం. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ మూవీని నాగబాబు నిర్మించారు. అప్పట్లో ఘరానా మొగుడు సక్సెస్ అనంతరం చిరంజీవి చేసిన సినిమా ఇది. దీనికి రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించగా.. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది.
మెగాస్టార్ చిరంజీవి మూడు భిన్నమైన పాత్రల్లో అద్భుతంగా నటించారు. అందుకుగాను తన గొంతును, లుక్‌ను పూర్తిగా మార్చేశారు. ఇక ఇందులో చిరంజీవికి జోడీగా.. రోజా, రమ్యకృష్ణ, నగ్మా నటించారు. ఈ క్రమంలోనే సినిమాలో మదర్ సెంటిమెంట్‌ను కూడా జోడించడంతో అద్భుతమైన హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పట్లో గ్రాఫిక్స్‌ను వాడుతున్నారు కానీ.. అప్పట్లో ఇవి లేవు. కనుక హీరోలు డబుల్ లేదా ట్రిపుల్ రోల్ చేయాల్సి వస్తే డూప్‌లను వాడేవారు. ఈ క్రమంలోనే చిరంజీవికి ఈ సినిమాలో ఇద్దరు డూప్‌ల అవసరం ఏర్పడింది.
ఇక ఈ మూవీలో చిరంజీవికి డూప్‌లుగా ఆయన వద్ద పనిచేస్తున్న పీఏ సుబ్బారావు, స్నేహితుడు, నటుడు ప్రసాద్ రావులు నటించారు. వీరు ఎత్తు, బరువులో చిరంజీవికి సమానంగా ఉంటారు. కనుకనే చిరంజీవికి వీరు డూప్‌లుగా చేశారు. ఇక ఆ తరువాత కూడా పలు సినిమాల్లో డూప్‌లుగా వీరు నటించారు. కాగా ముగ్గురు మొనగాళ్లు సినిమా అప్పట్లో ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది.