ఐఫోన్ 16 సిరీస్ అందరినీ ఆకట్టుకుంటోంది. చాలా మంది వినియోగదారులు ఆసక్తితో కొంటున్నారు. అయితే క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించి డిస్కౌంట్ ని పొందవచ్చు. ఇటీవల, Reddit వినియోగదారు 256 GB ఐఫోన్ 16ను కేవలం 27,000 రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
కానీ ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. క్రెడిట్ కార్డ్ తో రూ. 26,970 చెల్లించినట్లు తెలుస్తోంది. మిగతా అమౌంట్ కార్డుపై వచ్చిన రివార్డ్ పాయింట్ల ద్వారా కవర్ అయ్యాయి. ఆ విషయాన్ని వినియోగదారు స్క్రీన్‌షాట్ ని కూడా షేర్ చేసారు. రూ. 89,900 విలువైన ఐఫోన్ 16ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసారు.
వారు తమ హెచ్‌డిఎఫ్‌సి ఇన్ఫినియా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ.26,970 చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని కవర్ చేయడానికి రూ.62,930 విలువైన క్రెడిట్ కార్డ్ పాయింట్లను వాడడం జరిగింది. కార్డుని తెలివిగా వాడడంతో పాటు ఓ మెసేజ్ కూడా వారు రాసారు. “రివార్డ్ పాయింట్లకు ధన్యవాదాలు. ఇక మీదట చేసే పెద్ద ఖర్చుల కోసం కార్డుని ఉపయోగించడం పై నేను చింతిస్తాను” అని రాసారు.