Money Counting : ఈ ప్రపంచం మొత్తం ధనం మీదే నడుస్తుందన్న విషయం తెలిసిందే. డబ్బు లేనిదే మనం ఏమీ చేయలేము. మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏం చేయడానికి అయినా సరే డబ్బు కావల్సి వస్తోంది. డబ్బు లేకుండా అసలు ఏ పని జరగడం లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. అయితే మనకు వచ్చే డబ్బు పట్ల మాత్రం నిర్లక్ష్యంగా ఉండరాదు. ముఖ్యంగా డబ్బును లెక్కించే విషయంలో ఒక పొరపాటు మాత్రం అసలు చేయరాదు. చేస్తే అంతా నాశనమే అవుతుందని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పొరపాటు ఏమిటంటే..
సహజంగానే చాలా మంది నోట్లను లెక్కించేందుకు మధ్య మధ్యలో చేతి వేళ్లకు ఉమ్మితో తడి చేస్తుటారు. దీంతో అతుక్కున్న నోట్లను సులభంగా లెక్కించవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుందట. అందువల్ల డబ్బును లెక్కించేటప్పుడు ఎప్పుడు కూడా ఉమ్మితో నోట్లను తడపరాదు. అంతగా కావల్సి వస్తే నీటిని తడి చేసుకుని ఉపయోగించాలి. అంతేకానీ నోట్లను లెక్కించేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ ఉమ్మిని వాడరాదు.
ఇక కొందరు డబ్బును ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. కొందరు మంచం మీద, కొందరు షెల్ఫ్‌లలో, కొందరు వంటింట్లో పోపుల డబ్బాలలో డబ్బు పెడుతుంటారు. ఇలా చేసినా కూడా లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. డబ్బును ఎల్లప్పుడూ పర్సులో ఉంచాలి. లేదా ఏదైనా టేబుల్‌కు చెందిన సొరుగులో లేదా బీరువాలో, డబ్బును ఉంచే లాకర్‌లలో మాత్రమే డబ్బును పెట్టాలి. అంతేకానీ ఎక్కడ పడితే అక్కడ డబ్బును పెట్టరాదు. పెడితే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవడమే కాక.. తీవ్రమైన ధన నష్టం కలుగుతుంది. అన్నీ సమస్యలే వస్తాయి. అంతా నాశనమే జరుగుతుంది. కనుక డబ్బు ఈ విషయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలను పాటించాలి. లేదంటే నష్టాలను చవి చూడాల్సి వస్తుంది.