Erra Dimpena : మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో శరీరంలో గడ్డలు పుట్టడం కూడా ఒకటి. ఈ సమస్య ఎక్కువగా వేసవి కాలంలో వస్తుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు గడ్డలు ఏర్పడడం జరుగుతుంది. కొందరిలో శరీరతత్వం కారణంగా కాలంతో సంబంధం లేకుండా కూడా ఎప్పుడు పడితే అప్పుడు శరీరంలో ఎక్కడ పడితే అక్కడ గడ్డలు ఏర్పడతాయి. ఈ గడ్డలు ఏర్పడడం వల్ల అవి ఏర్పడిన ప్రాంతాలలో మనం శరీర భాగాలను కదిలించలేక ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ గడ్డలు నొప్పిని కూడా కలిగిస్తాయి.
సాధారణ వ్యక్తులలో ఒకవేళ ఈ గడ్డలు వస్తే అవి త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ షుగర్ వ్యాధి గ్రస్తుల్లో కనుక ఈ గడ్డలు ఏర్పడితే అవి తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ గడ్డల సమస్య నుండి బయటపడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వైద్యులను సంప్రదించడం, మందులు మింగడం వంటి అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పుడు ఇవి తగ్గినట్టే తగ్గి మరలా వస్తూ ఉంటాయి. ఈ గడ్డల సమస్యను మనం ఆయుర్వేదం ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. మన శరీరంలో ఏర్పడే గడ్డలను తగ్గించడంలో ఎర్ర దింపెన మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్కలు చెరువు గట్ల మీద, రోడ్డుకు ఇరువైపులా కనిపిస్తాయి.
ఇతర మొక్కల కంటే ఇవి కొద్దిగా తక్కువగా కనబడతాయి. ఈ ఎర్ర దింపెన మొక్క చిగుళ్లు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ చిగుళ్లు ముదిరే కొద్దీ పచ్చ రంగులోకి మారతాయి. ఈ ఆకులను తుంచినప్పుడు వాటి నుండి పాలు కారతాయి. ఈ మొక్క కాయలను పగలకొట్టి చూస్తే వాటిల్లో తెల్ల రంగులో ఉండే విత్తనాలు కనబడతాయి. ఈ మొక్క దాదాపు రెండు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. గడ్డల సమస్య నుండి బయటపడడానికి ఎర్ర దింపెన మొక్కను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఎర్ర దింపెన మొక్క లేత ఆకులను సేకరించి వాటికి పసుపు కలపాలి. వీటికి నీటిని కలపకుండా మెత్తగా నూరి ముద్దగా చేయాలి. ఈ మిశ్రమాన్ని వెంటనే గడ్డలపై ఉంచి గట్టిగా కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల మాములు వ్యక్తులతోపాటు షుగర్ వ్యాధి గ్రస్తుల్లో వచ్చే గడ్డలు కూడా త్వరగా నయం అవుతాయి. ఈ విధంగా శరీరంలో ఏర్పడే గడ్డలను తగ్గేలా చేయడంలో ఎర్ర దింపెన మొక్క ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.