Money : దేశంలోని అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) దేశంలోని పౌరుల కోసం ఇప్పటికే అనేక రకాల పాలసీలను అందిస్తోంది. వీటిల్లో పౌరులకు అనేక రకాల సదుపాయాలు లభిస్తున్నాయి. ఒక్కో పాలసీ భిన్నరకాల ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఎల్ఐసీకి చెందిన జీవన్ లక్ష్య పాలసీతో డబ్బును పొదుపు చేసుకుంటే.. చివరకు పెద్ద మొత్తంలో లాభాలను పొందవచ్చు. ఈ పాలసీలోచాలా సులభంగా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.

ఎల్ఐసీ అందిస్తున్న జీవన్ లక్ష్య పాలసీతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఓ వైపు ఇన్సూరెన్స్ లభిస్తుంది. మరోవైపు పాలసీ గడువు ముగిశాక పెద్ద మొత్తంలో డబ్బు అందుకోవచ్చు. ఈ క్రమంలోనే 29 ఏళ్ల వయస్సు ఉన్న ఒక వ్యక్తి ఈ పాలసీలో భాగంగా 25 ఏళ్ల గడువుతో రూ.15 లక్షల ఇన్సూరెన్స్ తీసుకుంటే 22 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే చాలు. పాలసీ గడువు ముగిసే ఏడాదికి 3 ఏళ్ల ముందు వరకు మాత్రమే ప్రీమియం కడితే చాలు. ఈ క్రమంలో నెలకు రూ.5,169 ప్రీమియం చెల్లించాలి. అంటే రోజుకు రూ.172 అవుతాయి. ఇక ఈ పాలసీ గడువు ముగిశాక రూ.28.50 లక్షలు వస్తాయి. ఇలా ఈ పాలసీతో పెద్ద ఎత్తున ప్రయోజనం పొందవచ్చు.
ఇక పాలసీ గడువు ముగియక ముందే పాలసీదారు చనిపోతే అతని నామినీ లేదా వారసులకు రూ.16.50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తారు. ఈ విధంగా ఈ పాలసీలో రెండు విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. ఇక ఇందులో కనీసం రూ.1 లక్ష ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. గరిష్టంగా ఇన్సూరెన్స్ ఎంతైనా తీసుకోవచ్చు. అందుకు లిమిట్ ఏమీ లేదు. పాలసీని కనీసం 13 ఏళ్ల కాలవ్యవధితో తీసుకోవాలి. గరిష్టంగా 25 ఏళ్ల వరకు కాలవ్యవధి లభిస్తుంది. ఇక ప్రీమియంను నెలకు, 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి కూడా కట్టవచ్చు. 18 ఏళ్లు ఆ పైన వయస్సు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. గరిష్టంగా వయస్సు పరిమితిని 50 ఏళ్లుగా విధించారు.