మనం క్యాలీప్లవర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాలీప్లవర్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. దీనితో మనం ఎక్కువగా క్యాలీప్లవర్ ఫ్రైను తయారు చేస్తూ ఉంటాము. క్యాలీప్లవర్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు. అయితే తరుచూ ఒకేరకంగా కాకుండా ఈ ఫ్రైను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా బఠాణీ, పచ్చి కొబ్బరి వేసి చేసే ఈ క్యాలీప్లవర్ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చయడం కూడా చాలా సులభం. ఎవరైనా ఈ ఫ్రైను సులభంగా తయారు చేసుకోవచ్చు. మరింత రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా క్యాలీప్లవర్ తో ఫ్రైను ఎల తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోబి పచ్చి కొబ్బరి బఠాణీ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అ టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగాతరిగిన పచ్చిమిర్చి – 2, సన్నగాతరిగిన ఉల్లిపాయ – 1, పచ్చి బఠాణీ- పావు కప్పు, క్యాలీప్లవర్ ముక్కలు – 2 కప్పులు, పసుపు -పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, సన్నగా తురిమిన కొబ్బరి తురుము – అర కప్పు, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
గోబి పచ్చి కొబ్బరి బఠాణీ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత బఠాణీ, క్యాలీప్లవర్ ముక్కలు వేసి కలపాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ముక్కలు మాడిపోకుండా కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ క్యాలీప్లవర్ ముక్కలు మెత్తగా అయ్యే వరకు పూర్తిగా మగ్గించాలి. క్యాలీప్లవర్ ముక్కలు మగ్గిన తరువాత ధనియాల పొడి, కారం, కొబ్బరి తురుము వేసి కలపాలి. తరువాత గరం మసాలా వేసి కలిపి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోబి పచ్చి కొబ్బరి బఠాణీ ప్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది . ఈవిధంగా గోబి ఫ్రైను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.