Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Munagaku Podi Idli : ఇడ్లీల‌ను ఇలా ఆరోగ్య‌క‌రంగా చేసి తింటే షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి..!

Editor by Editor
August 10, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Munagaku Podi Idli : ఇడ్లీలు అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. అందరూ ఇడ్లీల‌ను ఇష్టంగానే తింటారు. సాంబార్ లేదా కొబ్బరి చ‌ట్నీ, ప‌ల్లి చ‌ట్నీ, ట‌మాటా చ‌ట్నీల‌తో ఇడ్లీల‌ను తింటుంటే వ‌చ్చే మ‌జాయే వేరు. అందుక‌నే చాలా మంది ఫేవ‌రెట్ టిఫిన్‌గా ఇడ్లీ మారింది. అయితే ఇడ్లీల‌ను ఇంకా ఆరోగ్య‌క‌రంగా త‌యారు చేసుకుని తింటే దాంతో రుచికి రుచి పోష‌కాల‌కు పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఇక ఇడ్లీల‌ను ఆరోగ్యక‌రంగా ఎలా చేయాలంటే.. వాటిపై కాస్త మున‌గాకు పొడి చ‌ల్లాలి. దీంతో ఇడ్లీలు మ‌రింత రుచిగా ఉండ‌డ‌మే కాదు, మ‌న‌కు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఇక మున‌గాకుల పొడిని ఎలా త‌యారు చేయాలి, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మున‌గాకుల‌ను కొన్ని తీసుకుని వాటిని శుభ్రంగా క‌డిగి ఆర‌బెట్టాలి. ఆకులు పొడిగా అయ్యాక వాటిని పెద్ద పెనంపై వేసి వేయించాలి. ఆకులు క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించాలి. అనంతరం వాటిని ప‌క్కన పెట్టాలి. ఇంకో పాన్ తీసుకుని అందులో శ‌న‌గ‌లు, మినన ప‌ప్పు, న‌ల్ల మిరియాలు, జీల‌క‌ర్ర‌, నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేయాలి. అవి బంగారు గోధుమ రంగులోకి మారే వ‌ర‌కు వాటిని వేయించాలి. అనంత‌రం వాటిని తీసి ప‌క్క‌న పెట్టి చ‌ల్లార‌నివ్వాలి.

how to make Munagaku Podi Idli in telugu recipe is here know it
Munagaku Podi Idli

మున‌గాకుల పొడి త‌యారీ ఇలా..

అలాగే ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి రెబ్బ‌లు, ఎండు మిర్చిల‌ను వేసి కొన్ని నిమిషాల పాటు వేయించాలి. వెల్లుల్లి గోధుమ రంగులోకి మారాక స్ట‌వ్ ఆఫ్ చేయాలి. వేయించుకున్న అన్ని పప్పుల‌ను బ్లెండ‌ర్‌లో వేయాలి. అలాగే అన్ని సీడ్స్‌, వెల్లుల్లి, మిర్చిని కూడా వేయాలి. అనంత‌రం అందులో చింత‌పండు, ఉప్పు వేయాలి. వీట‌న్నింటినీ మెత్త‌ని పొడిలా ప‌ట్టుకోవాలి. త‌రువాత అందులోనే మున‌గాకుల‌ను కూడా వేసి మ‌ళ్లీ పొడిగా ప‌ట్టాలి. దీంతో మున‌గాకుల పొడి రెడీ అవుతుంది. ఇలా త‌యారు చేసిన మున‌గాకుల పొడి 2 నెల‌ల వ‌ర‌కు నిల్వ ఉంటుంది.

అయితే మున‌గాకుల పొడిని నిల్వ ఉంటుంది కానీ దీన్ని వాడే ముందు ఒక‌సారి చెక్ చేసుకుంటే మంచిది. ఇక మీరు రెగ్యుల‌ర్‌గా చేసే విధంగానే ఇడ్లీల‌ను చేశాక ఒక పాన్ తీసుకుని అందులో కాస్త ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన త‌రువాత అందులో ఇడ్లీల‌ను వేయాలి. అనంత‌రం వాటిపై ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మున‌గాకుల పొడిని చ‌ల్లాలి. కాస్త వేయించాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన మున‌గాకు పొడి ఇడ్లీలు రెడీ అవుతాయి. వీటిని చ‌ట్నీ అవ‌స‌రం లేకుండా నేరుగానే తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే ఈ ఇడ్లీలు మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాల‌ను కూడా అందిస్తాయి.

ఈ ఇడ్లీలు ఎంతో ఆరోగ్య‌క‌రం..

ఇలా త‌యారు చేసుకున్న ఇడ్లీలు ఎంతో ఆరోగ్య‌వంత‌మైన‌వ‌ని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే వీటిల్లో ముఖ్య ప‌దార్థం మున‌గాకు. ఇది మ‌న‌కు అనేక విధాలుగా లాభాల‌ను అందిస్తుంది. మున‌గాకుల పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మున‌గాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. క‌నుక ఈ పొడిని తింటే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌, షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా ఈ పొడితో ఓ వైపు చ‌క్క‌ని రుచిని ఆస్వాదిస్తూనే మ‌రోవైపు ఆరోగ్య‌క‌ర‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక ఇక‌పై మీరు ఇడ్లీల‌ను చేస్తే మున‌గాకుల పొడితో క‌లిపి తినండి. ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొందండి.

Tags: Munagaku Podi Idli
Previous Post

Egg Shells : కోడిగుడ్డు పెంకుల‌ను ప‌డేయ‌కండి.. వాటితో క్లీనింగ్ పొడిని ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Next Post

Garlic And Honey For Skin : రాత్రి పూట వెల్లుల్లి, తేనెను ఇలా తీసుకుంటే.. తెల్లారేస‌రికి మీ ముఖంలో మెరుపు వ‌స్తుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.