రోజు రోజుకీ వంటగ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎల్పీజీ సిలిండర్లను కొని వాడుదామంటే చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వంట గ్యాస్‌ను ఆదా చేయగలిగితే దాంతో అది ఎక్కువ రోజులు వస్తుంది. ఈ క్రమంలో గ్యాస్ ఖర్చు కూడా ఆదా అవుతుంది. మరి వంట గ్యాస్‌ను ఆదా చేసే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. గ్యాస్ స్టవ్ మీద బర్నర్ పై వంట పాత్రను సరిగ్గా ఉంచాలి. పాత్ర కింద మధ్యలో మంట తగిలేట్లు చూడాలి. దీంతో మంట త్వరగా అన్ని వైపులకు వ్యాప్తి చెందుతుంది. త్వరగా వేడి అవుతుంది. త్వరగా వంట చేయవచ్చు. గ్యాస్ ఆదా అవుతుంది.
2. గ్యాస్ స్టవ్ బర్నర్‌ను తరచూ శుభ్రం చేయాలి. దీంతో గ్యాస్ సరిగ్గా మండుతుంది. గ్యాస్ ఆదా అవుతుంది.
3. గ్యాస్ స్టవ్ బర్నర్‌ను శుభ్రం చేయకపోతే మంట ఎరుపు లేదా పసుపు లేదా ఆరెంజ్ కలర్ లో వస్తుంది. అలా వస్తే గ్యాస్ ఎక్కువగా వృథా అవుతుంది. వంట చేసేందుకు సమయం పడుతుంది. కనుక గ్యాస్ స్టవ్ బర్నర్‌ను రెగ్యులర్‌గా శుభ్రం చేయాలి. గోరు వెచ్చని నీళ్లతో బాగా రుద్ది శుభ్రం చేయాలి. దీంతో బర్నర్ లో మంట సరిగ్గా వస్తుంది. గ్యాస్ ఆదా అవుతుంది.
4. నీళ్లను ఉపయోగించి వంట చేసేటప్పుడు సరైన మోతాదులో నీళ్లను పోసి వంట వండాలి. దీని వల్ల గ్యాస్ వృథా కాకుండా చూసుకోవచ్చు.
5. కూరగాయలను మరీ అతిగా ఉడికించరాదు. ఉడికిస్తే పోషకాలు నశిస్తాయి. కనుక ఏ మేర అవసరం అయితే ఆ మేరకే వాటిని ఉడికించాలి. అందుకు నీళ్లను వాడాలి. దీంతో అవి త్వరగా ఉడుకుతాయి. గ్యాస్ ఆదా అవుతుంది.
6. పప్పు దినుసులు, మాంసం వండేటప్పుడు ప్రెషర్ కుక్కర్‌ను వాడాలి. దీంతో అవి త్వరగా ఉడుకుతాయి. గ్యాస్‌ను ఆదా చేయవచ్చు.
7. కొన్ని రకాల పదార్థాలను వండేటప్పుడు మంట ఎక్కువగా అవసరం ఉండదు. కనుక ఆ సమయంలో తగ్గించాలి. దీంతో గ్యాస్ తక్కువగా ఉపయోగించుకుంటుంది. గ్యాస్ ఆదా అవుతుంది.
ఈ విధంగా సూచనలు పాటించడం వల్ల గ్యాస్‌ను ఆదా చేయవచ్చు.