iPhone SE 3 : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ త్వరలోనే నూతన ఐఫోన్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో ఐఫోన్ ఎస్ఈ 3 ని విడుదల చేస్తుందని సమాచారం. ఇక ఈ ఫోన్‌ను అత్యంత చవక ధరకు యాపిల్ అందివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఈ ఫోన్‌కు చెందిన పలు ఫీచర్లు లీకయ్యాయి.
యాపిల్ తన ఐఫోన్ ఎస్ఈ 3 ఫోన్‌లో.. 4.7 ఇంచుల డిస్ ప్లేను ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది. అలాగే యాపిల్ ఎ15 బయానిక్ చిప్‌సెట్, 5జి, 4జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1821 ఎంఏహెచ్ బ్యాటరీ.. వంటి ఫీచర్లను ఈ ఫోన్‌లో అందిస్తుందని తెలుస్తోంది.
ఇక గతంలో విడుదలైన ఐఫోన్ ఎస్ఈ మోడల్స్‌తో పోలిస్తే ఐఫోన్ ఎస్ఈ 3 ఫోన్‌ను చాలా తక్కువ ధరకే.. కేవలం 300 డాలర్లకే విక్రయించనున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ ఫోన్ భారత్‌లో రూ.22వేలకు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. మార్చి చివరి వారంలో ఈ ఫోన్ విడుదల కానుందని సమాచారం.