Kalyaan Dhev : మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ, ఆమె భర్త కల్యాణ్ దేవ్‌ల గురించి ఈ మధ్య కాలంలో తరచూ వార్తలు వస్తున్నాయి. వీరు విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని.. అందుకనే గత కొంత కాలంగా వీరు విడిగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇక శ్రీజ తన పేరు చివర్లో భర్త పేరును తొలగించి తన పుట్టింటి పేరు కొణిదెలను యాడ్ చేసుకుంది. దీంతో వీరు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలకు బలం చేకూరింది. ఇక ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ జరుపుకున్న ఫంక్షన్స్, పండుగ వేడుకల్లోనూ కల్యాణ్ దేవ్ కనిపించలేదు. దీంతో శ్రీజ, అతను విడాకులు తీసుకునే విషయం కన్‌ఫామ్ అయిందని అంటున్నారు. అయితే తాజాగా కల్యాణ్ దేవ్ పెట్టిన పోస్టుతో మళ్లీ వీరి విడాకుల విషయం తెరపైకి వచ్చింది.

హోలీ సందర్భంగా కల్యాణ్ దేవ్ పండుగ వేడుకలను జరుపుకున్నాడు. అయితే శ్రీజ లేకుండానే అతను పండుగను సెలబ్రేట్ చేసుకున్నాడు. పైగా తమ కుమార్తెలు నివృత్తి, నవిష్కలు హోలీ పండుగను జరుపుకుంటున్న వీడియోను షేర్ చేశాడు. హోలీలో మునిగిపోయారంటూ.. కామెంట్ కూడా పెట్టాడు. ఈ క్రమంలోనే ఈ పోస్టు అందరి దృష్టినీ ఆకర్షించింది. శ్రీజ లేకుండా కల్యాణ్ దేవ్ పండుగను జరుపుకోవడంతో మరోమారు వీరి విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. వీరు విడిగా ఉంటున్నారనే విషయాన్ని నిర్దారించారు. కనుక వీరు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని.. మళ్లీ వార్తలను ప్రచారం చేస్తున్నారు. అయితే వీరు భవిష్యత్తులో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారా.. లేదా కలసిపోతారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
ఇక కల్యాణ్ దేవ్ విజేత సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఈ క్రమంలోనే ఇతను నటించిన కిన్నెరసాని అనే మూవీ త్వరలో రిలీజ్ కానుంది.