Lock Upp : కాంట్రవర్షియల్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవలి కాలంలో తెగ సంచలనంగా మారుతుంది. ఆమె ఏం మాట్లాడినా, ఏం సినిమా చేసినా అది క్వాంట్రవర్షియల్ అవుతోంది. తాజాగా కంగనా రనౌత్ హోస్ట్‌గా ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ రూపొందించిన లాక్ అప్ షో గురించి హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా చర్చనీయాంశమైంది. ఈ షోకు లాకప్ అని పేరు పెట్టి అనౌన్స్ చేయగానే మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ మంచి రెస్పాన్స్ లభించింది. ఫిబ్రవరి 27న ఆల్ట్ బాలాజీ యాప్‌లోనూ, ఎంఎక్స్ ప్లేయర్‌లోనూ 24 గంటలపాటు స్ట్రీమింగ్ చేయగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కేవలం 48 గంటల్లో 15 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. పోస్టర్‌లో కంగనా రనౌత్ బేడీలు పట్టుకొని ఉండగా, మిగతా కంటెస్టెంట్స్ అందరూ చేతులకు బేడీలతో ఉన్నారు. ఈ షో కోసం జైలు తరహా సెట్‌లో లాకప్స్ నిర్మించారు. ప్రతీ లాకప్‌లో ఒక్కొక్కరిని బంధిస్తారు. లాకప్‌లో వారు చేసే ఫెర్ఫార్మెన్స్ హైలెట్‌గా చూపించారు. లాకప్ గేమ్ షోలో వివాదాస్పద కమెడియన్ మునవర్ ఫరూఖీ, పూనమ్ పాండే వచ్చారు. రానున్న రోజులలో ప్రియాంక్ శర్మ, వికాస్ గుప్తా, షెహనాజ్ గిల్, అనుష్క సేన్, చేతన్ భగత్ లాంటి వాళ్లు గేమ్ షోలోకి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ‘లాకప్’పై హైదరాబాద్ సిటీ సివిల్‌కోర్టు స్టే ఆర్డర్ విధించింది. ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ఈ షోలో మునావర్ షారుఖీ, బబితా పోగట్, పూనమ్‌పాండే పాల్గొంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన సానోబర్‌బేగ్ వేసిన పిటిషన్‌ను స్వీకరించిన కోర్ట్ స్టే ఆర్డర్ ఆదేశాలను జారీ చేసింది. ప్రైడ్ మీడియా సంస్థకు చెందిన సానోబర్‌బేగ్ ‘లాకప్’ షో ఒరిజినల్ కాన్సెప్ట్ తనదేనని.. ‘ది జైల్’ అనే పేరుతో రిజిస్టర్ చేసుకున్నానని తెలిపారు. షాంతన్ రే, శీర్షక్ ఆనంద్ రాసిన ఈ కాన్సెప్ట్‌ను కాపీరైట్ యాక్ట్ ప్రకారం తాను మార్చి 7, 2018లో రిజిస్టర్ చేసుకున్నానని సానోబర్‌బేగ్ చెప్పారు. ఈ షో కాన్సెప్ట్‌ను తన అంగీకారం లేకుండా ఏక్తాకపూర్ తస్కరించిందని ఆయన ఆరోపించారు.