Pooja Hegde : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ టాప్ పొజిషన్‌కి చేరుకుంది. పూజా చివరిగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఆమె నటించిన ఆచార్య, రాధే శ్యామ్ చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. రాధే శ్యామ్ మార్చి 11న విడుదల కానుండగా, ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే మొన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న ప్రభాస్, పూజా హెగ్డే.. ఇప్పుడు మాత్రం పాలు నీళ్ళలా కలిసిపోయారు. ఇద్దరూ కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
నిజానికి రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రభాస్, పూజా హెగ్డే మధ్య విభేదాలు తలెత్తాయట. దీని గురించి గతంలో మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అప్పటి నుంచి ప్రభాస్, పూజా హెగ్డే ఎడమొహం పెడమొహం గానే ఉంటున్నారని సమాచారం. పూజా హెగ్డే బిహేవియర్ ప్రభాస్ కు అంతగా నచ్చకపోవడంతో ఈ విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే.. ప్రభాస్ కు సారీ చెప్పడంతో ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని అంటున్నారు. రీసెంట్‌గా జరిగిన రాధే శ్యామ్ ఈవెంట్‌లో ప్రభాస్, పూజా చాలా సన్నిహితంగా కనిపించారు.
`రాధేశ్యామ్` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ముంబయిలోని పీవీఆర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్ లో సందడి చేశారు పూజా హెగ్డే, ప్రభాస్. ప్రస్తుతం ముంబయి ఈవెంట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిలో ప్రభాస్, పూజా హెగ్దే జ్యోతిష్యం చూపించుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలు ఈవెంట్ లో భాగంగానే దిగినవి. అయితే జ్యోతిష్యం చూపించుకుంటూ ప్రభాస్ తన చేతిని బ్రాహ్మణుడికి చూపించాడు. అనంతరం పూజాహెగ్దే తన చేతిని చూపించి జ్యోతిష్యం చూపించుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడిగా నటిస్తున్నాడు. ఎమోషనల్ లవ్ స్టోరీ అయిన రాధే శ్యామ్ లో ప్రభాస్ పాత్ర అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోంది. విధికి, ప్రేమకు మధ్య జరిగిన యుద్ధంలాగా ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ అభివర్ణిస్తోంది.