Srivalli Song : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. పుష్ప బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. హిందీలో ఈ మూవీ అత్యధిక స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీలో రష్మిక మందన్న సామి స్టెప్‌తోపాటు అల్లు అర్జున్ వేసిన.. శ్రీవల్లి స్టెప్ వైరల్‌గా మారాయి. చాలా మంది అల్లు అర్జున్ ఐకానిక్ స్టెప్‌ను వేసి ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు, క్రికెటర్లు సైతం శ్రీవల్లి స్టెప్‌కు ఫిదా అయిపోయారు.
ఇక తాజాగా ఓ వ్యక్తి శ్రీవల్లి పాటను ఒకేసారి 5 భాషల్లో పాడి అలరించాడు. అతను అలా పాడిన పాటకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎస్ అధికారి దీపాన్షు కుబ్రా ఆ వ్యక్తి వీడియోను షేర్ చేయగా.. అతను పాడిన శ్రీవల్లి పాట అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం మళ్లీ హిందీలో అతను ఈ పాట పాడాడు. ఈ పాట వాస్తవానికి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పవచ్చు. ఇప్పటికే చాలా మంది శ్రీవల్లి పాటను ఆలపించడంతోపాటు శ్రీవల్లి స్టెప్ వేసి అలరించారు.
#PushpaTheRise फ़िल्म का #Srivalli गीत, 5 अलग-अलग भाषाओं में.
हुनरमंद गायक द्वारा गज़ब की कलात्मक प्रस्तुति.
ज़रूर सुनें. pic.twitter.com/LGWtdzyhCj— Dipanshu Kabra (@ipskabra) February 22, 2022
కాగా పుష్ప రెండో పార్ట్ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. అందులో అల్లు అర్జున్, రష్మిక మందన్న త్వరలో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం క్లైమాక్స్‌ను రచించే పనిలో ఉన్నట్లు తెలిసింది. దీంతో త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.