Bheemla Nayak : పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం.. భీమ్లా నాయక్. మళయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ ఈవెంట్‌లో భాగంగా అందరూ మాట్లాడారు. దర్శకుడు సాగర్ కె చంద్రతోపాటు పవన్ కల్యాణ్ కూడా ఈ సినిమాకు పనిచేసిన త్రివిక్రమ్‌ను ఆకాశానికెత్తేశారు. అసలు త్రివిక్రమ్ లేకపోతే ఈ సినిమాయే లేదని.. ఆయన ఈ సినిమాకు బ్యాక్ బోన్‌గా పనిచేశారని కొనియాడారు. స్క్రీన్ ప్లే, మాటలను అందించడమే కాక సినిమాను దగ్గరుండి పర్యవేక్షించారని అన్నారు. అయితే ఈ ఈవెంట్‌లో త్రివిక్రమ్ మాట్లాడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
సాధారణంగా ఏ చిన్న ఫంక్షన్‌కు వెళ్లినా త్రివిక్రమ్ మాట్లాడుతారు. కానీ పవన్ కు అత్యంత సన్నిహితుడు అయి ఉండి.. ఆయన సినిమాకు పనిచేసి కూడా త్రివిక్రమ్ ఈ వేడుకలో మాట్లాడకపోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే అందుకు బలమైన కారణాలు రెండు ఉన్నట్లు తెలుస్తోంది.
భీమ్లా నాయక్ చిత్రం షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి త్రివిక్రమ్ సినిమాను దగ్గరుండి పర్యవేక్షించారు. సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించినప్పటికీ.. ఆయన స్వయంగా దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారని అన్నారు. అంత మాత్రానికి మరి ప్రత్యేకంగా దర్శకున్ని ఎందుకు పెట్టుకోవాలి.. సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించవచ్చు కదా.. అని విమర్శలు వచ్చాయి. దీంతో ఆ ముద్ర తనపై పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఈవెంట్‌లో మాట్లాడలేదని తెలుస్తోంది. కనుకనే క్రెడిట్ మొత్తం దర్శకుడికి వెళ్లింది. ఒక వేళ త్రివిక్రమ్ మాట్లాడి ఉంటే ఆ క్రెడిట్ మొత్తం ఆయనకే ఇచ్చేవారు. అందుకనే త్రివిక్రమ్ ఈ వేడుకలో మాట్లాడలేదని తెలుస్తోంది.
ఇక తాజాగా బండ్ల గణేష్ మాట్లాడినట్లు లీకైన ఓ ఆడియో టేపు కూడా త్రివిక్రమ్‌ను మనస్థాపానికి గురి చేసిందట. కనుక ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడొద్దని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నారట. కనుకనే ఆయన ఈవెంట్‌లో మాట్లాడలేదని తెలుస్తోంది. అయితే ఆయన మాట్లాడకపోయినా.. మధ్యలో కొన్ని సమయాల్లో బండ్ల గణేష్.. అంటూ కొందరు ఫ్యాన్స్ నినాదాలు చేశారు. ఇక బండ్ల గణేష్ పవన్ క్యాంప్ నుంచి దూరమయ్యారు.. అని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అసలు విషయాలు బయట పడే అవకాశాలు ఉన్నాయి.