Pawan Kalyan : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన ఆదివారం పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయన అక్కడ సభలో ప్రసంగించేందుకు కారులో వెళ్లారు. అయితే కొంతసేపు కారు పైకెక్కి ఆయన ప్రజలకు అభివాదం చేశారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని వేగంగా కారు మీదకు దూసుకువచ్చాడు. దీంతో పవన్‌ను ఆ అభిమాని ముందుకు నెట్టాడు.
ఈ క్రమంలోనే అభిమాని తోయడంతో పవన్ ముందుకు పడిపోయారు. అయితే వెంటనే అక్కడి కార్యకర్తలు ఆ అభిమానిని అక్కడి నుంచి పంపించారు. ఈ క్రమంలోనే అభిమానుల అత్యుత్సాహం హద్దులు దాటుతుందని పవన్ వారికి క్లాస్ పీకారు. అందరినీ గౌరవించాలని పవన్ అన్నారు.
#JSPForFisherman
ఇలాంటి చెత్త ఎదవ ల కోసమే పాదయాత్ర చేయడానికి భయపడేది అభిమానం అంటే ఆయనకి ఏమి కాకుండా చూసుకోవడం మన వల్ల ఆయన ని ఇబ్బంది పెట్టడం కాదు…#PawanKalyan pic.twitter.com/2Z1xsIvEZb— Sathish koppineedi (@svksathish) February 20, 2022
కాగా నర్సాపురంలో పవన్ కల్యాణ్ మత్స్యకారుల సమస్యలపై మాట్లాడారు. ఈ సభకు వచ్చేందుకు రోడ్లు కూడా బాగాలేవన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు అండగా ఉండే పరిస్థితులు రావాలని అన్నారు. ఇక ఈ నెల 21వ తేదీన పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. దీనికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ వేడుకలోనే సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీని ఈ నెల 25వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.