Free RRR Tickets : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను మార్చి 25వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు టిక్కెట్లు దొరుకుతాయో.. దొరకవో.. అని ఆందోళన చెందుతున్న ప్రేక్షకులకు పేటీఎం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మూవీ టిక్కెట్లను ఉచితంగానే పొందే బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది.
ప్రముఖ డిజిటల్ వాలెట్ యాప్ పేటీఎం ద్వారా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టిక్కెట్లను ఉచితంగానే పొందవచ్చు. అందుకు ఏం చేయాలంటే.. పేటీఎం యాప్ ద్వారా పేటీఎం జెనీ మొబైల్ నంబర్‌కి రూ.1 పంపించాలి. దీంతో రూ.150 వరకు విలువైన ఆర్ఆర్ఆర్ మూవీ వోచర్ ను ఇస్తారు. ఇక పేటీఎం జెనీకి పంపిన రూ.1 ని కూడా తిరిగి ఖాతాలో రీఫండ్ చేస్తారు. అంటే.. మనకు ఉచితంగా సినిమా టిక్కెట్ లభించినట్లు అవుతుంది.
ఇక ఈ ఆఫర్‌తో ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ ను ఉచితంగానే పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ మార్చి 24వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేటీఎం తెలియజేసింది. కనుక దీన్ని త్వరగా పొందాలంటే వీలైనంత త్వరగా పైన తెలిపిన విధంగా చేయాల్సి ఉంటుంది.