Darbha Gaddi : వినాయకుడికి ఉంచే పత్రిలో దర్భలు ఒకటి. ఇవి అంటే ఆయనకు ఇష్టం.. కనుకనే దర్భలతో ఆయనను పూజిస్తారు. ఇక ప్రతి శుభ కార్యంలోనూ దర్భలను వాడుతుంటారు. ఇవి సాక్షాత్తూ దైవ స్వరూపం అని నమ్ముతారు. కనుకనే శుభకార్యాల్లో దర్భలను తప్పక ఉపయోగిస్తుంటారు. ఇక గ్రహణ సమయంలో ఇంట్లో తినే వస్తువులపై దర్భలను ఉంచుతారు. గ్రహణం వీడాక దర్భలను తీసేస్తారు. ఇలా చేయడం వల్ల మనం తినే ఆహారాలతో మనకు ఎలాంటి దోషాలు రాకుండా ఉంటాయని విశ్వసిస్తారు. అయితే ఇన్ని ప్రయోజనాలున్న దర్భలతో మనకు ఒక గొప్ప లాభం కూడా కలుగుతుంది. అదేమిటంటే..
దర్భలను ఇంటికి తెచ్చి పూజలు చేసి వాటిని మన ఇంటి ప్రధాన ద్వారానికి బయటి వైపు కట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే దోషాలు అన్నీ పోతాయి. ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లోని వారికి సమస్యలు తగ్గుతాయి. అలాగే ధనం లభిస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏ వ్యాపారం చేసినా రాణిస్తారు.
అయితే దర్భలను ఎప్పుడు పడితే అప్పుడు తేకూడదు. భరణి నక్షత్రం రోజున దర్భలను తెచ్చి శుభ్రం చేయాలి. దర్భలను వేళ్లతో సహా సేకరించాలి. నాలుగైదు దర్భలను సేకరించి ఇంటికి తెచ్చి శుభ్రంగా కడగాలి. అనంతరం వాటికి పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. తరువాత ఆ దర్భలను కట్టగా కట్టి మన ఇంటి ప్రధాన ద్వారానికి బయటి వైపు కట్టాలి. ఇలా చేస్తే.. సంపద సిద్ధిస్తుంది. అష్టైశ్వరాలు కలుగుతాయి. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కలుగుతుంది. ఎలాంటి మొండి వ్యాధులు అయినా సరే తగ్గుతాయి. అలాగే ఆర్థిక సమస్యలు పోయి ధనం బాగా సంపాదిస్తారని.. పండితులు చెబుతున్నారు.