Sudigali Sudheer : బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా హాస్యాన్ని పండించడంలో సుడిగాలి సుధీర్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే.. షోలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్‌లు చేసే స్కిట్‌లను చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువగా జబర్దస్త్‌ను వీక్షిస్తుంటారు. అయితే ప్రేక్షకులను ఆకట్టుకోవాలనో.. మరో విషయమో తెలియదు కానీ.. సుధీర్‌పై పేలుతున్న పంచ్‌ల మోతాదు పెరిగిపోయిందనే చెప్పవచ్చు. గతంలో నాగబాబు జడ్జిగా ఉన్నప్పుడు కూడా సుధీర్ స్కిట్ చేసే సమయంలో పంచ్‌లు వేసేవారు. అయితే ఆ డోసు ఇటీవల కాస్త శృతి మించిందనే చెప్పవచ్చు.
సుడిగాలి సుధీర్ తాజా చేసిన స్కిట్‌లో రష్మి పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించింది. ఈ క్రమంలోనే సుధీర్ అందులో అమ్మాయిల పిచ్చి ఉన్నట్లుగా యథావిధిగా నటించాడు. ఇక సుధీర్ ను పోలీసులు పట్టుకుని స్టేషన్‌లో ఆఫీసర్ అయిన రష్మి ముందు ఉంచుతారు. అప్పుడు అతని ఫోన్ తీసుకున్న రష్మి దాని పాస్‌వర్డ్ ఏమిటని అడుగుతుంది.. దీంతో సుధీర్ ఉమ్మ.. అని చెబుతాడు. ఈ క్రమంలో మేడమ్‌కు పాస్‌వర్డ్ చెప్పమంటే ఉమ్మ అంటావేమిట్రా.. అని పోలీసులు అనగానే.. సుధీర్ అదే పాస్‌వర్డ్ అని అంటాడు.
ఇక రష్మి నీ జిమెయిల్ పాస్‌వర్డ్ ఏమిటని అడుగుతుంది. అందుకు సుధీర్ బదులిస్తూ.. త్వరగా వచ్చేయ్.. అంటాడు. మళ్లీ అది కూడా పాస్‌వర్డ్ అని కవర్ చేస్తాడు. ఇక ఉదయం లేవగానే ఏం చేస్తావని అడిగితే ఇంటికి వస్తానని చెబుతాడు. అదేంటి.. రాత్రంతా ఇంట్లో ఉండవా.. అని రష్మి అడిగితే.. అందుకు జడ్జి మనో కల్పించుకుని.. సుధీర్ రాత్రంతా సొరంగంలో ఉంటాడు, అందుకనే ఉదయం ఇంటికి వస్తాడు.. అని అంటాడు. దీంతో అందరూ నవ్వేస్తారు.
అయితే ఈ స్కిట్‌లో అడల్ట్ కామెడీ కాస్త శృతి మించిందనే చెప్పవచ్చు. ఒకప్పుడు జబర్దస్త్ షోను ఇంటిల్లిపాది కూర్చుని ఎంచక్కా వీక్షించి కాసేపు నవ్వుకునేవారు. కానీ ఈ మధ్య కాలంలో జబర్దస్త్‌ను ఎవరూ చూడడం లేదు. అందులో వారు పేల్చే డబుల్ మీనింగ్ డైలాగ్‌లే అందుకు కారణమని చెప్పవచ్చు. ఇక తాజాగా చేసిన స్కిట్‌లో మనో అలా సొరంగం అనే భాష వాడడం.. దానికి అర్థం ఏమిటో.. ఆ జబర్దస్త్ షో నిర్వాహకులే చెప్పాలి. లేదా ఆ డైలాగ్ రాసిన వారు దానికి అర్థం చెప్పాలి. ఏది ఏమైనా.. ఇటీవలి కాలంలో ఈ షోలో బూతు కాస్త ఎక్కువైందనే చెప్పవచ్చు.