Almonds : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల నట్స్‌లో బాదంపప్పు ఒకటి. వీటిని ఎంతో మంది ఇష్టంగా తింటారు. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బాదంపప్పులో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు శక్తిని, పోషణను అందిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అయితే బాదంపప్పును రోజులో ఏ సమయంలో తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదంపప్పును రోజులో ఉదయం పూట తింటే అధికంగా ప్రయోజనాలను పొందవచ్చు. ముందు రోజు రాత్రి 8 నుంచి 10 బాదంపప్పులను నీటిలో వేసి నానబెట్టాలి. మరుసటి రోజ ఉదయం వాటిని పొట్టుతీసి బ్రేక్‌ఫాస్ట్‌లో కలిపి తినాలి. దీంతో ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ఉదయాన్నే మనకు పెద్ద మొత్తంలో శక్తి అవసరం అవుతుంది. రోజంతా పనిచేయడానికి అవసరం అయ్యే అధిక భాగం శక్తి మనకు బ్రేక్‌ఫాస్ట్ ద్వారానే లభిస్తుంది. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో బాదంపప్పును తినాలి. దీంతో శక్తి బాగా లభిస్తుంది. రోజంతా నీరసం, నిస్సత్తువ దరిచేరకుండా ఉత్సాహంగా పనిచేయవచ్చు. చురుగ్గా ఉంటారు. అలాగే మెదడు పనితీరు మెరుగు పడుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.
బాదంపప్పులను చిన్నారులకు ఉదయం పెట్టడం వల్ల వారిలో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దీంతో వారు స్కూల్‌లో బాగా నేర్చుకుంటారు. చదువుల్లో రాణిస్తారు. బాదంపప్పులు వారిని యాక్టివ్‌గా ఉంచుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు రాకుండా చూస్తాయి. అందువల్ల చిన్నారులకు సైతం ఉదయాన్నే బాదంపప్పును తినిపించాల్సి ఉంటుంది.
బాదంపప్పును ఉదయం తినడం వల్ల మన శరీరానికి మాంగనీస్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పెద్ద ఎత్తున లభిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. అధిక బరువు తగ్గేందుకు దోహదపడతాయి. అధికంగా శక్తిని అందిస్తాయి. కనుక బాదంపప్పును ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి తినడం ఎంతో మేలు చేస్తుంది.
అయితే బాదంపప్పును నీటిలో నానబెట్టి పొట్టు తీసి తింటే అవి త్వరగా జీర్ణం అవుతాయి. దీంతో గ్యాస్ సమస్య రాకుండా చూసుకోవచ్చు. పైగా వృద్ధులు, పిల్లలకు పొట్టు తీసి పెడితేనే మంచిది. కనుక ఉదయం పొట్టు తీసిన బాదంపప్పును తినడం అలవాటు చేసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.