Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Tomato Pudina Pachadi : ట‌మాటా పుదీనా ప‌చ్చ‌డిని ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

D by D
December 28, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Tomato Pudina Pachadi : మ‌నం పుదీనాతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పుదీనాతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. పుదీనాతో మ‌నం చేసుకోద‌గిన వంట‌కాల్లో పుదీనా ప‌చ్చ‌డి ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది అప్పుడ‌ప్పుడూ చేస్తూ ఉంటారు. పుదీనా ప‌చ్చ‌డిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పుదీనా ప‌చ్చ‌డిలో టమాటాలు వేసి మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ట‌మాట‌లు వేసి పుదీనా ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట పుదీనా ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పుదీనా క‌ట్ట‌లు – 4, త‌రిగిన ట‌మాటాలు – 3, ఎండుమిర్చి – 10 లేద త‌గిన‌న్ని, చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, నూనె – 2 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్.

Tomato Pudina Pachadi recipe in telugu very tasty how to make
Tomato Pudina Pachadi

ట‌మాట పుదీనా ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. వీటిని దోర‌గా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో పుదీనా వేసి వేయించాలి. దీనిని కూడా ద‌గ్గ‌ర‌చ ప‌డే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో మ‌రి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లను, చింత‌పండును వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత జార్ లో వేయించిన ఎండుమిర్చి, ఉప్పు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత వేయించిన పుదీనా, వెల్లుల్లి రెబ్బ‌లు, జీల‌క‌ర్ర వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ట‌మాట వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.

ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, రెండు ఎండుమిర్చి, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చ‌డిని వేసి మ‌రో రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట పుదీనా ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే పుదీనా ప‌చ్చ‌డి కంటే ఈ విధంగా ట‌మాటాలు వేసిన పుదీనా ప‌చ్చ‌డిమ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఇష్టంగా తింటారు.

Tags: Tomato Pudina Pachadi
Previous Post

Biryani Leaves Water : బిర్యానీ ఆకుల‌తో ఎన్నో అద్భుత‌మైన లాభాలు.. దీన్ని తీసుకోవ‌డం మ‌రిచిపోకండి..

Next Post

Raw Banana : ప‌చ్చి అర‌టికాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.