Biryani Leaves Water : బిర్యానీ ఆకును ఎక్కువగా మనం వంటల్లో ఉపయోగిస్తుంటాం. మసాలా కూరల్లో వీటిని వేస్తుంటారు. అలాగే బిర్యానీ రైస్‌ను చేయడంలోనూ ఈ ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటితో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే కేవలం రుచి, వాసనకే కాదు.. బిర్యానీ ఆకులు మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించడంలోనూ ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని రోజూ నీటిలో మరిగించి ఆ నీళ్లను ఒక కప్పు మోతాదులో తాగడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. బిర్యానీ ఆకుల నీళ్లను తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బిర్యానీ ఆకుల నీళ్లను తాగడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇది షుగర్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. మెడిసిన్లపై ఎక్కువగా ఆధార పడడాన్ని తగ్గిస్తుంది. సహజసిద్ధంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కనుక బిర్యానీ ఆకుల నీళ్లను రోజూ తాగాలి. దీంతో షుగర్‌ను అదుపులో ఉంచవచ్చు. అలాగే ఈ నీళ్లను తాగితే జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్ణం ఉన్నవారు రోజూ ఈ నీళ్లను తాగవచ్చు. దీంతోపాటు గ్యాస్, కడుపులో మంట, మలబద్దకం వంటి ఇతర జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
బిర్యానీ ఆకుల నీళ్లను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగి బయటకు పోతుంది. దీంతో ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. ఆస్తమా నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లను తాగడం వల్ల ఫంగస్ ఇన్‌ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. అలాగే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఈ నీళ్లను తాగడం వల్ల కీళ్ల నొప్పులు, వాపుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
ఈ నీళ్లను తాగితే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. ఈ ఆకుల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. కనుక ఈ ఆకులతో చేసిన నీళ్లను రోజూ తాగితే క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా బిర్యానీ ఆకుల నీళ్లతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజూ మరిచిపోకుండా తాగాలి. ముఖ్యంగా ఉదయం పరగడుపున లేదా రాత్రి నిద్రకు ముందు తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.