Raw Banana : మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనం అనేక రకాల పండ్లను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో అరటి పండు ఒకటి. ఇది మనకు అన్ని కాలాల్లో విరివిరిగా లభిస్తూ ఉంటాయి. అరటిపండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న విషయం మనందరికి తెలిసిందే. కేవలం అరటి పండ్లే కాకుండా అరటి చెట్టులో ప్రతి భాగం కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అరటి పువ్వును వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అలాగే అరటి పువ్వుతో వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అరటి పువ్వుతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.
అదే విధంగా అరటి ఆకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. అరటి ఆకుల్లో భోజనం చేయడం అలాగే వాటిని ఇంటిగుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవడం వంటి చేస్తూ ఉంటారు. అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అరటి పండ్లు, అరటి ఆకులు మనకు మేలు చేసినట్టే పచ్చి అరటి కాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పచ్చి అరటికాయలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. వీటిని ఎలా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ ఒక పచ్చి అరటికాయను నీటిలో ఉడికించి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పచ్చి అరటికాయను ఇలా నేరుగా తీసుకోలేని వారు వాటిని కూరగా చేసుకుని కూడా తినవచ్చు. పచ్చి అరటికాయలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పచ్చిఅరటి కాయను ఉడికించి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు పచ్చి అరటికాయను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే బరువు తగ్గడంలో కూడా పచ్చి అరటి కాయ మనకు దోహదపడుతుంది. పచ్చి అరటి కాయను ఉడికించి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు త్వరగా కరుగుతుంది.
దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. షుగర్ వ్యాధితో బాధపడే వారు అరటి పండును తీసుకోవడానికి బదులుగా పచ్చి అరటికాయను ఉడికించి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా పచ్చి అరటికాయను తీసుకోవడం వల్ల శరీరంలో మెటాబాలిజం పెరుగుతుంది. శరీరం పోషకాలను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. కడుపు నొప్పితో, డయేరియాతో బాధపడుతున్నప్పుడు పచ్చి అరటికాయను ఉడికించి తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది.ఈ విధంగా పచ్చి అరటికాయ మనకు ఎంతో మేలు చేస్తుందని దీనిని తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.