Vastu Tips : ఎవరికైనా సరే ధనం సంపాదించాలని, కోటీశ్వరులు అవ్వాలని ఉంటుంది. అందుకనే అందరు వివిధ రకాల పనులు చేస్తుంటారు. కొందరు స్వయం ఉపాధిని ఎంచుకుంటే కొందరు ఉద్యోగం చేస్తారు. అయితే ఎందులో అయినా విజయం సాధించాలని డబ్బు సంపాదించాలనే అందరు కోరుకుంటారు. కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. చాలా మంది విజయం సాధించలేకపోతుంటారు. ఎంత కష్టపడినా సమస్యలు వెన్నంటి ఉంటూనే ఉంటాయి. ఎంత శ్రమించినా ఫలితం దక్కదు. ఆర్థిక సమస్యలు, ఇంట్లో ఇబ్బందులు, కుటుంబ కలహాలు.. ఇలా అనేక సమస్యలతో సతమతం అయ్యే వారు మనలో చాలా మందే ఉండి ఉంటారు. అయితే వీటన్నింటికీ వాస్తు దోషాలు, నెగెటివ్ ఎనర్జీ కూడా కారణం అవుతుంటాయి. కనుక వీటిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆటోమేటిగ్గా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఇక ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఇంట్లో ఉండే వాస్తు దోషాలు, నెగెటివ్ ఎనర్జీని తొలగించడంలో కర్పూరం బాగా పనిచేస్తుంది. ప్రతి ఆది, శుక్రవారాల్లో సాయంత్రం సమయంలో ఇంట్లో కర్పూరాన్ని వెలిగించాలి. ఇంట్లో ప్రతి గదిలోకి కూడా కర్పూరం వాసన, పొగ వెళ్లేట్లు చూడాలి. దీంతో వాస్తు దోషాలు పోతాయి, నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది మిమ్మల్ని సమస్యల నుంచి బయట పడేస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే సాయంత్రం సమయంలో ఆవనూనెతో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలను వేయాలి. ఇలా చేసినా కూడా దోషాలు పోతాయి.
మీరు ఇంట్లో ఎప్పుడైనా చపాతీలు చేసినప్పుడు ముందుగా పెనంపై కాస్త పాలు చిలకరించాలి. తరువాత చేసే మొదటి చపాతీని ఆవుకు తినిపించాలి. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి సంతోషిస్తారు. మీకు ఆహారానికి కొరత ఉండకుండా చూస్తారు. అలాగే మీకు ఆర్థిక సమస్యలు లేకుండా చేస్తారు. మిమ్మల్ని కటాక్షిస్తారు. మిమ్మల్ని ధనవంతులను చేస్తారు.
మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే రోజూ ఉదయాన్నే ఆ చెట్టుకు నీళ్లు పోయాలి, సాయంత్రం పూట తులసి కోట వద్ద దీపం వెలిగించాలి, అలాగే పేదలకు ఆహారం, దుస్తులు, డబ్బు, విద్య వంటివి దానం చేయాలి. ఈవిధంగా మీరు ఏ దానం చేస్తే మీకు అదే మళ్లీ రెండింతలు లభిస్తుంది. దీంతో మీకు ఉండే సమస్యలన్నీ గట్టెక్కుతాయి. ఇంట్లోనూ అందరూ సంతోషంగా ఉంటారు.