హిందూ సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరు నమ్ముతారు.. రాముడుగా వాలిని చంపిన పాపం.. కృష్ణుడుగా అనుభవించడం జరిగింది.. దేవుళ్ళకే వారు చేసిన పనులతో కష్టాలు బాధలు తప్పలేదని.. మానవులం మనము ఎంత అనుకుంటారు. అందుకనే చేసే పనిని.. మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలని పురాణాలు పేర్కొన్నాయి. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే అని హిందూమతంలో విశ్వాసం. ఇదే విషయాన్నీ మహాభారతంలో చెప్పడం జరిగింది. అయితే మంచి పనులు చేసిన మనమెందుకు బాధపడాలి అన్న ప్రశ్నకి శ్రీకృష్ణుడు ఆసక్తికర సమాధానం చెప్పారు.
పురాతన కాలంలో, ఇద్దరు పురుషులు ఒక నగరంలో నివసించేవారు. వారిలో ఒకరు వ్యాపారి కాగా మరొకరు దొంగ. వ్యాపారి రోజూ గుడికి వెళ్లి దేవుడికి పూజలు చేసేవాడు. ప్రతిరోజు పేదలకు భోజనం పెట్టేవాడు. చాలా దానధర్మాలు కూడా చేసేవాడు. ఆ దొంగ గుడికి వెళ్లి డబ్బులు దోచుకునేవాడు. ఆ తర్వాత ఒకరోజు ఆ నగరంలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా ఆలయంలో పూజారి తప్ప ఎవరూ లేరు. వర్షం చూసి దొంగ గుడికి వెళ్లాడు. కొంత సమయం తరువాత, పూజారి ఎక్కడికో వెళ్ళినప్పుడు, దొంగ అంతా దొంగిలించాడు.వర్షం ఆగిన తర్వాత వ్యాపారి అక్కడికి చేరుకుని పూజారి తిరిగి వచ్చేసరికి అక్కడ నుంచి అంతా చోరీకి గురైనట్లు కనిపించింది. వ్యాపారినే దొంగగా భావించిన పూజారి దొంగ-దొంగ అని అరవడం మొదలుపెట్టాడు. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని వ్యాపారినే దొంగ అని అనుకోవడం మొదలుపెట్టారు. ఇది చూసిన వ్యాపారి షాక్కు గురయ్యాడు. ఎలాగోలా గుడి నుంచి తప్పించుకున్నాడు.
ఆలయం నుంచి బయటకు రాగానే వ్యాపారి కారు ఢీకొని గాయపడ్డాడు. ఇంటికి చేరిన తరువాత, అతను ఆలోచించడం ప్రారంభించాడు, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నేను రోజూ పూజిస్తాను , పేదలకు దానాలు కూడా ఇస్తాను అని అనుకున్నాడు. ఇక కొద్ది రోజులకి ఇద్దరు చనిపోయి యమలోకానికి చేరుకున్నారు. అప్పుడు వ్యాపారి వేరే వ్యక్తిని అడుగుతూ.. నేను జీవితాంతం మంచి పనులు చేసినా ఎప్పుడూ నన్ను ఎందుకు అవమానించవలసి వచ్చింది? నేను చాలా దానాలు చేసాను, అయిన బాధపడవలసి వచ్చింది. అప్పుడు యమరాజ్ బదులు ఇస్తూ నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని అన్నాడు. కారును ఢీకొన్న రోజు మీ జీవితంలో చివరి రోజు. కానీ మీ మంచి పనుల వల్ల ఆ రోజు మీరు రక్షించబడ్డారు. ఈ పాపి జాతకంలో రాజ్యయోగం ఉంది, కానీ చెడు పనుల కారణంగా అతను దానిని అనుభవించలేకపోయాడు అని శ్రీ కృష్ణుడు అర్జునుడితో అన్నాడు, మంచి పనులు చేసే వ్యక్తి ఎందుకు విచారంగా ఉండాల్సి వస్తుందో ఇప్పుడు అర్ధమైందా అని అంటాడు.