మన శరీరంలో విటమిన్‌ డి చేసే అద్భుతాలు.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..!

మన శరీరానికి అవసరమైన అనేక రకాల విటమిన్లలో విటమిన్‌ డి ఒకటి. మన శరీరంలో అనేక జీవక్రియలను సరిగ్గా నిర్వహించేందుకు మనకు విటమిన్‌ డి అవసరం అవుతుంది. విటమిన్‌ డి వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మన శరీరంలో విటమిన్‌ డి చేసే అద్భుతాలు.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..!

1. విటమిన్‌ డి వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఎక్కువ సేపు గాఢంగా నిద్రపోతారు. శరీరంలో ట్రిప్టోఫాన్‌ లెవల్స్ సమతుల్యం అవుతాయి. దీని వల్ల సెరొటోనిన్‌ ఉత్పత్తి అవుతుంది. దీంతో నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.

2. విటమిన్‌ డి వల్ల అధిక బరువు తగ్గవచ్చు. అలసట తగ్గుతుంది. ఎంత శ్రమ చేసినా అంత సులభంగా అలసిపోరు. ఉత్సాహంగా పనులు చేస్తారు.

3. విటమిన్‌ డి వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆస్తమా, ఎగ్జిమా వంటి వ్యాధులు తగ్గుతాయి. క్యాన్సర్‌ వచ్చే రిస్క్‌ తగ్గుతుంది.

4. విటమిన్‌ డి వల్ల శరీరంలోని వాపులు తగ్గుతాయి. రోగాల నుంచి త్వరగా కోలుకుంటారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

5. ఒత్తిడి, ఆందోళనలతో సతమతం అవుతున్న వారు విటమిన్‌ డి ని తీసుకోవాలి. దీంతో మూడ్‌ మారుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

6. విటమిన్‌ డిని తీసుకోవడం వల్ల కండరాలు మెరుగ్గా పనిచేస్తాయి. కండరాల నిర్మాణం జరుగుతుంది. కండరాలకు మరమ్మత్తులు అవుతాయి. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి.

7. విటమిన్‌ డి తగినంత ఉంటే శరీరం మనం తినే ఆహారాల్లో ఉండే కాల్షియంను ఎక్కువగా శోషించుకుంటుంది. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.

విట‌మిన్ డి మ‌న‌కు సూర్య‌ర‌శ్మి ద్వారా ల‌భిస్తుంది. రోజూ ఉద‌యం ఎండ‌లో క‌నీసం 20 నిమిషాల పాటు శ‌రీరం 60 శాతం ఎండ క‌వ‌ర్ అయ్యేలా ఉండాలి. దీంతో మ‌న శ‌రీరం దానంత‌ట అదే విట‌మిన్ డిని త‌యారు చేసుకుంటుంది. అలాగే విట‌మిన్ డి మ‌న‌కు చేప‌లు, ప‌చ్చి బ‌ఠానీలు, రొయ్య‌లు, కోడిగుడ్లు, చీజ్‌, నెయ్యి, పాలు, పుట్ట‌గొడుగుల్లో ఎక్కువ‌గా ల‌భిస్తుంది.

Admin

Recent Posts