విట‌మిన్ బి12 మ‌న శ‌రీరానికి ఎందుకంత అవ‌స‌రం ? దాని ప్రాముఖ్య‌త ఏమిటి ? తెలుసా ?

మ‌న శరీరానికి అవ‌స‌రం అయిన అనేక ర‌కాల విట‌మిన్ల‌లో విట‌మిన్ బి12 కూడా ఒక‌టి. ఇది మ‌నకు ఎంత‌గానో అవ‌స‌రం అయ్యే పోష‌క ప‌దార్థం. అయితే దీని విలువ చాలా మందికి తెలియ‌దు. దీన్ని మ‌నం రోజూ త‌ప్ప‌నిస‌రిగా అందేలా చూసుకోవాలి.

విట‌మిన్ బి12 మ‌న శ‌రీరానికి ఎందుకంత అవ‌స‌రం ? దాని ప్రాముఖ్య‌త ఏమిటి ? తెలుసా ?

చేప‌లు, మాంసం, పాల ఉత్ప‌త్తులు తీసుకునేవారికి విట‌మిన్ బి12 కావ‌ల్సినంత ల‌భిస్తుంది. అయితే శాకాహారుల‌కు మాత్రం త‌గినంత విట‌మిన్ బి12 ల‌భించ‌దు. దీంతో శాకాహారుల్లో విట‌మిన్ బి12 లోపం వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

విట‌మిన్ బి12 నీటిలో క‌రుగుతుంది. మ‌నం తినే అనేక ర‌కాల ఆహారాల్లో విట‌మిన్ బి12 ఉంటుంది. ఇది నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాలు త‌యారు అయ్యేలా చేస్తుంది. డీఎన్ఏను సంశ్లేష‌ణ చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. విట‌మిన్ బి12 నీటిలో క‌రుగుతుంది. శ‌రీరంలో నిల్వ కాదు, క‌నుక దీన్ని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. తృణ ధాన్యాలు, పండ్లు, ప‌లు ఇత‌ర ఆహారాల్లో విట‌మిన్ బి12 ఉంటుంది.

ఇంట‌ర్నేష‌న‌ల్ జ‌ర్న‌ల్ ఆఫ్ క్యాన్స‌ర్ చెబుతున్న ప్ర‌కారం విట‌మిన్ బి12 లోపిస్తే గ్యాస్ట్రిక్ క్యాన్స‌ర్‌, పెద్ద‌పేగు క్యాన్స‌ర్‌, పాంక్రియాటిక్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

విట‌మిన్ బి12 వ‌ల్ల నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విట‌మిన్ లోపిస్తే మెద‌డు యాక్టివ్‌గా ఉండ‌దు. చురుకుద‌నం కోల్పోతారు. అల‌ర్ట్ నెస్ త‌గ్గుతుంది. శ‌రీరంలో ప‌లు జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌హించ‌బ‌డ‌వు.

విట‌మిన్ బి12 మ‌న శ‌రీర మెట‌బాలిజంను మెరుగు ప‌రిచి మ‌న‌కు శ‌క్తి అందేలా చూస్తుంది. దీంతో యాక్టివ్‌గా ఉంటారు. మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌య్యేందుకు విట‌మిన్ బి12 ఇత‌ర బి విట‌మిన్ల‌తో క‌లిసి స‌హ‌క‌రిస్తుంది. దీని వ‌ల్ల క‌ణాలు శ‌క్తిని స‌రిగ్గా ఉప‌యోగించుకుంటాయి. విట‌మిన్ బి12 లోపిస్తే చాలా మందికి కుడి వైపు మెడ‌, భుజాలు, చేతులు బాగా నొప్పిగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ ల‌క్ష‌ణాలు ఉంటే డాక్ట‌ర్ ను క‌లిసి విట‌మిన్ బి12 ప‌రీక్ష చేయించుకోవాలి. విట‌మిన్ బి12 త‌క్కువ‌గా ఉంటే డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు స‌ప్లిమెంట్ల‌ను వాడాలి.

అయితే డ‌యాబెటిస్ స‌మ‌స్య ఉన్న‌వారిలో స‌హ‌జంగానే విట‌మిన్ బి12 లోపిస్తుంటుంది. వారు వాడే మందుల వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్‌గా ఇలా జ‌రుగుతుంది. క‌నుక షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు విట‌మిన్ బి12 ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఈ విటమిన్ త‌గ్గితే మందుల‌ను వాడాలి. అలాగే విట‌మిన్ బి12 ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి.

విట‌మిన్ బి12 మ‌న‌కు ఎక్కువ‌గా పాలు, పాల ఉత్ప‌త్తులు, మ‌ట‌న్‌, చికెన్‌, లివ‌ర్‌, కోడిగుడ్లు, న‌ట్స్‌, అవ‌కాడో, పుట్ట గొడుగులు వంటి ఆహారాల్లో ల‌భిస్తుంది. విట‌మిన్ బి12 మ‌న‌కు రోజుకు 2.4 మైక్రోగ్రాముల మోతాదులో అవ‌స‌రం. పాలిచ్చే త‌ల్లులు, గ‌ర్భిణీల‌కు ఇది రోజుకు 2.8 మైక్రోగ్రాముల మోతాదులో అవ‌స‌రం అవుతుంది.

Share
Admin

Recent Posts