Strawberries : మన శరీరానికి పోషణను, శక్తిని, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించడంలో పండ్లు ఎల్లప్పుడూ ముందు వరుసలోనే నిలుస్తాయి. ఈ క్రమంలోనే మనకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అనేక రకాల పండ్లు వివిధ రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఎక్కువ ప్రయోజనాలు అందించే పండ్లు మాత్రం కొన్నే ఉంటాయి. వాటిల్లో స్ట్రాబెర్రీలు కూడా ఒకటి. ఇవి ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. కానీ వీటిని కేవలం రోజుకు 3 తిన్నా చాలు.. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. స్ట్రాబెర్రీలను రోజూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీలను తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చని.. దీంతో ఎక్కువ ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీలను తినడం వల్ల చర్మంలో కాంతి పెరుగుతుంది. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. వయస్సు ఎక్కువగా ఉన్నప్పటికీ యవ్వనంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే స్ట్రాబెర్రీలను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఈ పండ్లను తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు.

ఈ పండ్లను తింటే డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. స్ట్రాబెర్రీలను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దీంతో మెదడు సంబంధ సమస్యలు రావు. మెదడు ఉత్తేజంగా ఉంటుంది. యాక్టివ్‌గా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.
ఈ పండ్లను తినడం వల్ల వైరస్, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. రోగాలు రాకుండా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అయితే స్ట్రాబెర్రీలు ఆరోగ్యకరమే అయినప్పటికీ వాటిని గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మాత్రం డాక్టర్ సూచన మేరకు తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన ఎవరైనా సరే స్ట్రాబెర్రీలను నిరభ్యంతరంగా తినవచ్చు. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.