Anjeer : రోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు పండ్లను తింటే చాలు. మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మన అనారోగ్య సమస్యలను దూరం చేసే ఈ పండ్లు ఏమిటి.. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. వీటిని ఎలా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో అంజీరా పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంజీరా పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. డ్రై ఫ్రూట్స్ గా కూడా వీటిని మనం తీసుకుంటూ ఉంటాం. అంజీరా పండ్లల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి.
ఈ అంజీరాలను నానబెట్టి తీసుకోవడం వల్ల వీటిలో ఉండే పోషకాలను మనం పూర్తి స్థాయిలో పొందవచ్చు. రోజూ రాత్రి ఒక కప్పు నీటిలో రెండు లేదా మూడు అంజీరాలను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తాగి అంజీరాలను తినాలి. ఈ విధంగా అంజీరాలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అంజీరా పండ్లల్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, పొటాషియం,మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు కూడా వీటిని ఎటువంటి సందేహం లేకుండా తినవచ్చు. అంజీరాలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం కూడా ఉందని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.
డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు రోజుకు ఒకటి లేదా రెండు అంజీరా పండ్లను తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ప్రతిరోజూ ఆహారంలో భాగంగా అంజీరాలను తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, ధృడంగా పెరుగుతుంది. మలబద్దకం సమస్యను తగ్గించడంలో కూడా అంజీరా మనకు ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం పరగడుపున నానబెట్టిన అంజీరాలను తినడం వల్ల సుఖ విరోచనం అవుతుంది. దీనిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకం సమస్య తగ్గేలా చేయడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలో రక్తాన్ని పెంచడంలో కూడా అంజీరా మనకు ఉపయోగపడుతుంది.
రక్తహీనత సమస్యతో బాధపడే వారు అంజీరాలనుచతీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. దీంతో మనం రక్తహీనత సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడే వారు నెల రోజుల పాటు గోరు వెచ్చని పాలల్లో నానబెట్టుకున్న అంజీరాలను వేసి తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, అధిక రక్తపోటును నియంత్రించడంలో, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో కూడా అంజీరా మనకు దోహదపడుతుంది. అంజీరాను తీసుకోవడం వల్ల కంటి చూపు కూడా పెరుగుతుంది. కంటి సమస్యలు మన దరి చేరుకుండా ఉంటాయి.
అలాగే నీరసం, నిస్సత్తువ, అలసట వంటి సమస్యలతో బాధపడే వారు అంజీరాలను తీసుకోవడం వల్ల శరీరంగా బలంగా, శక్తివంతంగా తయారవుతుంది. హార్మోన్ల అసమతుల్యతను తొలగించడంలో, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా అంజీరాలు మనకు సహాయపడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ రెండు లేదా మూడు నానబెట్టిన అంజీరాలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.