భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. ఇది జనవరి 2, 1954 లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు నలభై మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ పురస్కారం 13 జులై 1977 నుండి 26 జనవరి 1980 వరకు జనతా పార్టీ పాలనలో కొద్దికాలం పాటు నిలిపివేయబడింది. ఒకే ఒక్కసారి 1992లో సుభాష్ చంద్రబోస్ కు ఇవ్వబడిన పురస్కారం చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనుకకు తీసుకొనబడింది. ఎలాంటి జాతి, ఉద్యోగం,స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం ఇవ్వబడుతుంది.
ఈ పురస్కారగ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేయవలసి ఉంటుంది. భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది (మొదటిది ఆరూ- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉపప్రధాన మంత్రి, ముఖ్య న్యాయాధీశులు). కానీ ఈ గౌరవం వలన ఎలాంటీ అధికారాలు లేదా పేరు ముందు ప్రత్యేక బిరుదులూ రావు. ఈ పురస్కారం పొందిన విదేశీయుల జాబితాలో సరిహద్దు గాంధి గా పేరుపొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1987), నెల్సన్ మండేలా (1990) ఉన్నారు. భారతరత్న పురస్కారం పొందిన వారి జాబితా ఇలా ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888-1975) 1954, చక్రవర్తుల రాజగోపాలాచారి (1878-1972) 1954, డా.సి.వి.రామన్ (1888-1970) 1954, డా. భగవాన్ దాస్ (1869-1958) 1955, డా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861-1962) 1955, జవహర్ లాల్ నెహ్రూ (1889 -1964) 1955లో భారత రత్న పొందారు.
గోవింద్ వల్లభ్ పంత్ (1887-1961) 1957, ధొండొ కేశవ కార్వే (1858-1962) 1958, డా. బీ.సీ.రాయ్ (1882-1962) 1961, పురుషోత్తమ దాస్ టాండన్ (1882-1962) 1961, రాజేంద్ర ప్రసాద్ (1884-1963) 1962, డా. జాకీర్ హుస్సేన్(1897-1969) 1963, పాండురంగ వామన్ కానే (1880-1972) 1963, లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (1904-1966) 1966, ఇందిరాగాంధీ (1917-1984) 1971, వీ.వీ.గిరి (1894-1980) 1975, కే.కామరాజు (మరణానంతరం) (1903-1975) 1976, మదర్ థెరీసా (1910-1997) 1980, ఆచార్య వినోబా భావే (మరణానంతరం) (1895-1982) 1983, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1890-1988) 1987, యం.జి.రామచంద్రన్ (మరణానంతరం) (1917-1987) 1988, బి.ఆర్.అంబేద్కర్ (మరణానంతరం) (1891-1956) 1990, నెల్సన్ మండేలా (1918) 1990, రాజీవ్ గాంధీ (మరణానంతరం) (1944-1991) 1991 భారత రత్న లభించింది.
సర్దార్ వల్లభాయి పటేల్ (మరణానంతరం) (1875-1950) 1991, మొరార్జీ దేశాయి (1896-1995) 1991, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (మరణానంతరం) (1888-1958) 1992, జే.ఆర్.డీ.టాటా (1904-1993) 1992, సత్యజిత్ రే (1922-1992) 1992, సుభాష్ చంద్ర బోస్ (1897-1945) (తరువాత ఉపసంహరించబడినది) 1992, ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (1931) 1997, గుర్జారీలాల్ నందా (1898-1998) 1997, అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (1906-1995) 1997, ఎం.ఎస్.సుబ్బలక్ష్మి (1916-2004) 1998, సి.సుబ్రమణ్యం (1910-2000) 1998, జయప్రకాశ్ నారాయణ్ (1902-1979) 1998, రవి శంకర్ (1920) 1999, అమర్త్య సేన్ (1933) 1999, గోపీనాథ్ బొర్దొలాయి (1927) 1999లకు భారత రత్న వచ్చింది.
లతా మంగేష్కర్ (1929) 2001, బిస్మిల్లా ఖాన్ (1916) 2001, భీమ్ సేన్ జోషి (1922) 2008, సచిన్ టెండూల్కర్ 2014, సి. ఎన్. ఆర్. రావు 2014, మదన్ మోహన్ మాలవ్యా 2015, అటల్ బిహారీ వాజపేయి 2015లకు కూడా భారత రత్న వచ్చింది.