కిస్మిస్‌లు, అంజీర్, ఆలుబుకర.. వంటివి డ్రై ఫ్రూట్స్ జాబితాకు చెందుతాయి. వివిధ రకాల ద్రాక్షలను ఎండ బెట్టి కిస్మిస్‌లను తయారు చేస్తారు. ఇక పలు రకాల పండ్లను ఎండబెడితే అవి డ్రై ఫ్రూట్స్‌గా మారుతాయి. డ్రై ఫ్రూట్స్‌లో అనేక పోషకాలు ఉంటాయి. అయితే వీటిని రోజులో ఏ సమయంలో తింటే మనకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్ లలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్లు ఎ, బి, సిలతోపాటు పొటాషియం, మెగ్నిషియం, జింక్ వంటి మినరల్స్ ఉంటాయి. అయితే డ్రై ఫ్రూట్స్ ను ఉదయం తింటేనే మంచిది. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు తీసుకోవాలి.
సాధారణంగా మనకు ఉదయం పెద్ద మొత్తంలో శక్తి అవసరం అవుతుంది. మనం యాక్టివ్‌గా పనిచేస్తాం. కనుక ఆ సమయంలో డ్రై ఫ్రూట్స్ ను తింటే మేలు జరుగుతుంది. శరీరానికి పోషకాలు లభిస్తాయి. దీంతోపాటు శక్తి కూడా అందుతుంది. రోజంతా యాక్టివ్‌గా పనిచేయవచ్చు. ఉత్సాహంగా ఉంటారు. బద్దకం ఉండదు. అందువల్ల డ్రై ఫ్రూట్స్ ను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లో తీసుకోవడం ఉత్తమం.
అయితే ఉదయం డ్రై ఫ్రూట్స్ ను తినలేమని అనుకునే వారు వాటిని సాయంత్రం స్నాక్స్ సమయంలో తినడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే చాలా మంది ఆ సమయంలో జంక్ ఫుడ్స్ ను తింటుంటారు. వాటికి బదులుగా డ్రై ఫ్రూట్స్ ను తింటే మంచిది. దీంతో పోషకాలు లభిస్తాయి. శక్తి అందుతుంది. రోజంతా పనిచేసి బాగా అలసిపోతే సాయంత్రం డ్రై ఫ్రూట్స్ ను తింటే శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. అలసట తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన ఉండవు. మంచి మూడ్ వస్తుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
కనుక ఎవరికి నచ్చినట్లు వారు డ్రై ఫ్రూట్స్ ను ఉదయం లేదా సాయంత్రం తినవచ్చు. వాటిని ఆయా సమయాల్లో తింటే ఆ విధంగా ప్రయోజనాలను పొందవచ్చు.