గుండెపోటు, గుండెసంబంధిత తదితర వ్యాధులనుండి దూరంగా వుండాలనుకుంటే, క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన రతిక్రియ చేయాలని తమ రీసెర్చిలో వెల్లడైనట్లు మసాచ్యూసెట్ లోని న్యూ ఇంగ్లాండ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. రతిక్రియ వారానికి కనీం రెండు లేదా మూడు సార్లు జరుపుతూంటే, గుండె సంబంధిత రక్తనాళాలు చురుకుగా పనిచేస్తాయని గుండెపోటు నుండి దూరంగా వుండవచ్చని తెలుపుతున్నారు. ఇంతకంటే ఎక్కువ సార్లు కూడా రతిక్రియలో పాల్గొన్నా ప్రయోజనమేనని ప్రత్యేకించి పురుషులలో 45 శాతం మేరకు రతిక్రీడ గుండె జబ్బులను తగ్గించే అవకాశం వుందని తెలుస్తోంది.
వారానికి ఒకసారి లేదా అంతకంటే తక్కువగా రతిక్రియలో పాల్గొనే పురుషులు గుండె సంబంధిత జబ్బుల బారినపడే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. రీసెర్చిలో 40 నుంచి 70 సంవత్సరాలు కలిగిన వేయిమందిని పరిశోధకులు పరిశోధించారు. వీరిని సుమారు పదహారు సంవత్సరాలపాటు అధ్యయనం చేసి తాము ఫలితాలను రాబట్టినట్లు వారు వెల్లడించారు.
అంతేకాక, ఎవరైతే తమ జీవితభాగస్వామితో జరిపే రతిక్రియలో భావప్రాప్తిని పొందుతుంటారో అలాంటి వారిలో గుండె సంబంధితమేకాక ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదమే లేదని కూడా రీసెర్చర్లు వెల్లడించారు.