Mohammed Siraj : టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హైదరాబాద్‌కి చెందిన ఈ బౌలర్ కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు పడి ఈ స్థాయికి ఎదిగాడు. సిరాజ్ కి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.బీసీసీఐ సిరాజ్‌కి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేయగా, ‘నా కుటుంబ సభ్యులు చదువుకోవాలని పట్టుబట్టారు. అయితే మేం అద్దె ఇంట్లో నివాసముండే వాళ్లం. ఇంట్లో మా నాన్న మాత్రమే సంపాదిస్తున్న వ్యక్తి.
కాబట్టి ఆయనకు తోడుగా నేను పనికి వెళ్ళేవాడిని. ఒక క్యాటరింగ్ లో చేరాను. అక్కడ రుమాలీ రోటీలు కాల్చేవాడిని. ఈ ప్రయత్నంలో చాలా సార్లు నా చేతులు కాలిపోయాయి. రోజుకు రూ. 200 వస్తే 150 రూపాయలు ఇంట్లో ఇచ్చేవాడిని. మిగతా 50 రూపాయలు నా దగ్గరే ఉంచుకునేవాడిని’ అని ఎమోషనల్ అయ్యాడు సిరాజ్. నాన్న ఆటో రిక్షా తోలుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. దీంతో, ఆయనకు సాయంగా ఉండాలనుకున్నా. తొలి రోజుల్లో క్యాటరింగ్ పనులు చేసేవాడిని . టెన్నిస్ క్రికెట్ ఎక్కువగా ఆడటం పేస్ ను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడింది. కఠినంగా శ్రమిస్తే ఏదో ఒక రోజు ఫలితం దక్కుతుంది. నాలుగేళ్ల క్రితం క్రికెట్ వదిలేద్దామనుకున్నా. సక్సెస్ కాకపోతే అదే నా చివరి సంవత్సరం అనుకున్నా. అయితే ఫామ్ లోకి రావడంతో జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నా” అని సిరాజ్ తెలిపాడు.
మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. అతను బీసీసీఐ ‘ఏ’ గ్రేడ్ ప్లేయర్ కూడా. ఇప్పటివరకు భారత్ తరఫున 27 టెస్టులు, 41 వన్డేలు, 10 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. భారత్ కు ఎన్నో విజయాలు అందించాడు. ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధం అవుతున్నాడు.