House Main Door : మనలో చాలా మంది ఇంటి ప్రధాన ద్వారానికి బయట వైపు, లోపలి వైపు నరదిష్టి తగలకుండా వివిధ రకాల ఫోటోలను ఉంచుతారు. రాక్షసుడి ఫోటోలతో పాటు, యంత్రాలను ఉంచుతారు. అలాగే కొందరు గణపతి ఫోటోలను ఉంచుతారు. అసలు మన ఇంటి ప్రధాన ద్వారం బయట అలాగే లోపల ఎటువంటి ఫోటోలను ఉంచాలి. ఎటువంటి ఫోటోలనుఉంచడం వల్ల మనకు మేలు కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వీటి గురించి ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారం మనకు సిరులను కురిపిస్తుంది. ఈ ద్వారం గుండానే మనం ఇంట్లోకి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. ప్రధాన ద్వారం నుండి దుష్టశక్తులు రాకుండా ఉండడానికి గుమ్మం బయట చాలా మంది గణపతి ఫోటోను పెడుతూ ఉంటారు.
కానీ దేవుళ్ల ఫోటోలను గుమ్మం బయట పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. అసలు ప్రధాన ద్వారం బయట ఎటువంటి ఫోటోలు పెట్టక పోయిన ఏం కాదని వీలైతే శంఖు చక్రాలు, నామాల ఫోటోలు పెట్టుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అలాగే ప్రధాన ద్వారం లోపల వైపు గుమ్మం పైన అమ్మవారి ఫోటోను కానీ, వెంకటేశ్వర సమేత లక్ష్మీ దేవి ఫోటోను కానీ, అష్ట లక్ష్మీ ఫోటో కానీ, కుల దేవతలకు సంబంధించిన ఫోటోను కానీ పెట్టుకోవచ్చు. అలాగే నరదిష్టి తగలకుండా, మంచి జరగడానికి గుమ్మం లోపలి వైపు గో సమేత ఐశ్వర్య కాళీ ఫోటోను పెట్టుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఇలా గో సమేత ఐశ్వర్య కాళీ ఫోటోను పెట్టుకోవడం వల్ల దిష్టి తగలకుండా ఇంట్లో చెడు ప్రభావం లేకుండా ఉంటుంది. చాలా మంది తెలియక ఇంటి ప్రధాన ద్వారం బయట వైపు గణపతి ఫోటోను ఉంచుతారని అసలు దేవుళ్ల పోటోలను ఇంటి బయట పెట్టకూడదని గణపతి ఫోటోను ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంచాలని వారు చెబుతున్నారు.
అలాగే కొందరు లక్ష్మీదేవి ఫోటోను ఇంటి ఫ్రధాన ద్వారానికి ఎదురుగా పెడుతూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదని ఇలా ఉంచడం వల్ల లక్ష్మీ దేవి బయటకు వెళ్లడానికి మార్గం చూపించిన వాళ్లం అవుతామని పండితులు చెబుతున్నారు. అదే విధంగా ఇంట్లో తూర్పు, పడమర గోడలకు ఉంచిన దేవుడి ఫోటోలను పూజిస్తేనే ఫలితం ఉంటుందని ఇతర దిక్కులోఉంచిన దేవుడి ఫోటోలను పూజిస్తే ఎటువంటి ఫలితం ఉండదని పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో కాళ్లు కనిపించకుండా పద్మంలో కూర్చున్న అమ్మవారి ఫోటోలను ఉంచి పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని వారు చెబుతున్నారు.