కరోనా నేపథ్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉద్యోగులు అయితే గత ఏడాదిన్నర కాలంగా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఎంతో మంది మానసిక, శారీరక ఒత్తిళ్లకు గురవుతున్నారు. చాలా మంది కుర్చీల్లోనే కూర్చుని గంటల తరబడి పనిచేస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.
అయితే నటి భాగ్యశ్రీ స్విస్ బాల్‌తో ఎలా వర్కవుట్‌లో చేయాలో వివరించారు. ఈమేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. స్విస్ బాల్‌తో వర్కవుట్ చేసే విధానాన్ని ఆమె తెలియజేశారు. అందులో ఆమె పూల్ పక్కన స్విస్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తుండడాన్ని గమనింవచ్చు.
స్విస్ బాల్‌తో వర్కవుట్ చేయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇది తనకు చాలా ఫేవరెట్ ఎక్సర్‌సైజ్ అని నటి భాగ్యశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. దీని వల్ల బ్యాలెన్స్, కోర్ స్ట్రెంగ్త్ మెరుగుపడతాయని తెలిపారు.
స్విస్ బాల్‌తో వర్కవుట్ చేస్తే వెన్నెముక, చేతులు, భుజాలు దృఢంగా మారుతాయి. దీని వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. కండరాలను దృఢంగా చేసుకునేందుకు ఈ వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వల్ల శరీరం చక్కని భంగిమలో ఉంటుంది. పొట్ట భాగంలో కండరాలు దృఢంగా మారుతాయి. పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. దీన్ని రోజూ చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది.