ఎంతో పురాతన కాలం నుంచి మనం రోజూ తినే ఆహారాల్లో నెయ్యి ఒక భాగంగా ఉంది. నెయ్యి ఎంతో రుచిగా ఉంటుంది. రోజూ అన్నంలో కూర వేసుకుని అందులో నెయ్యి కలిపి తింటారు. చిన్నారులకు తల్లులు నెయ్యిని తినిపిస్తుంటారు. దీంతో వారిలో ఎదుగుల సరిగ్గా ఉంటుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. నెయ్యిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
భారతీయులు నెయ్యి, పాలు అంటే ఎంతో ఇష్ట పడతారు. భారతీయులందరూ ఈ రెండు ఆహారాలను తీసుకుంటుంటారు. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకోవచ్చా ? అంటే.. అందుకు నిపుణులు అవుననే సమాధానం చెబుతున్నారు.
పాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం మన శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో నాడులు ప్రశాంతంగా మారుతాయి. సెరటోనిన్ వల్ల శరీరంలో మెలటోనిన్ కూడా పెరుగుతుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. అందుకనే పాలను తాగాలని చెబుతుంటారు.
రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగడం వల్ల నాడులు ప్రశాంతంగా మారి మనస్సు హాయిగా ఉంటుంది. మన శరీరంలో మెలటోనిన్ పెరగడమే ఇందుకు కారణం. పాల వల్ల మెలటోనిన్ పెరుగుతుంది. ఇది ఒక హార్మోన్ అయినప్పటికీ న్యూరో ట్రాన్స్‌మిటర్ లా పనిచేస్తుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. పాలలో ఉండే ప్రోటీన్లు మెదడులో ఉండే గాబా (GABA) రిసెప్టర్లను ఉత్తేజం చేస్తాయి. దీంతో ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. నిద్ర బాగా పడుతుంది.
రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. మెటబాలిజం పెరుగుతుంది. అధిక బరువు తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అయితే పాలలో నెయ్యి కలిపి తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. నెయ్యిలో ఉండే ప్రోటీన్లు కీళ్ల దృఢత్వాన్ని తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టం తగ్గుతుంది. దీంతో కణాలు సురక్షితంగా ఉంటాయి.
రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ నెయ్యిని కలిపి తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. అందుకు గాను పాలు, నెయ్యిలో ఉండే ఎంజైమ్‌లు సహాయం చేస్తాయి. ఈ క్రమంలో నాడులు ప్రశాంతంగా మారి నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
గర్భిణీలు కూడా ఈ విధంగా పాలలో నెయ్యి కలిపి తాగవచ్చు. దీని వల్ల బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. అనేక పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.