Mandakini : అలనాటి అందాల సుందరి, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మందాకిని గురించి చాలా మందికి తెలుసు. అప్పట్లో ఈమె నటించిన సినిమాలు సంచలనం సృష్టించాయి. సినీ ఇండస్ట్రీలోనే ఈమె సినిమాలు ఒక ఊపు తెచ్చాయి. 1980లలో మందాకిని హవా నడిచింది. అయితే వాస్తవానికి ఆమె అసలు పేరు మందాకిని కాదు. ఆమె పేరు యాస్మిన్ జోసెఫ్.
మందానికిది ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్. 1963లో జన్మించింది. ఈమె తన సినీ కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం ఎక్కడికి వెళ్లినా ఈమెను రిజెక్ట్ చేశారు. తరువాత ఒక సందర్భంలో రాజ్ కపూర్ ఈమెను చూసి తాను తీస్తున్న రామ్ తేరీ గంగా మెయిలీ అనే సినిమాలో హీరోయిన్ చాన్స్ ఇచ్చారు. అప్పుడు మందాకినికి 22 ఏళ్లు. అయితే అప్పటి వరకు ఆమె యాస్మిన్‌గానే కొనసాగింది. కానీ రామ్ తేరీ గంగా మెయిలీ సినిమాకు ఆమె పేరును రాజ్ కపూర్.. మందాకినిగా మార్చారు. ఈ క్రమంలోనే రాజ్ కపూర్ కుమారుడు రాజీవ్ కపూర్ పక్కన ఆమె హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాలో ఆమె పలు బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. దీంతో అప్పట్లో ఈ సినిమా పెను సంచలనం సృష్టించింది.
అయితే ఈ సినిమాపై అప్పట్లో చాలా మంది రాజ్ కపూర్‌ను విమర్శించారు. తరువాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే అప్పట్లో ఉన్న ప్రముఖ బాలీవుడ్ హీరోలు అందరితోనూ ఆమె నటించింది. ఇక పలు ఇతర భాషలకు చెందిన చిత్రాల్లోనూ మందాకిని నటించింది. తెలుగులో ఈమె సూపర్ స్టార్ కృష్ణ పక్కన సింహాసనం అనే సినిమాలో విష కన్య పాత్రలో నటించి మెప్పించింది. వహ్వా నీ యవ్వనం అనే పాటలో ఈమె నటించింది. తరువాత భార్గవ రాముడు అనే మరో తెలుగు సినిమాలోనూ ఈమె నటించింది.
మొత్తం మందాకిని 44 సినిమాల్లో నటించగా.. వాటిల్లో అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఇక ఈమె చివరి సారిగా 1996లో జోర్దార్ అనే సినిమాలో నటించింది. తరువాత సినిమాలు చేయడం మానేసింది. కొన్నాళ్ల పాటు టిబెట్‌లో యోగా సాధన చేసింది. అనంతరం డాక్టర్ కగ్‌యుర్ టి రిన్‌పోచె ఠాకూర్ అనే మాజీ బౌద్ధ సన్యాసిని ఈమె వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానం కలిగారు. రబ్బిల్ అనే కుమారుడు, రబ్జె ఇన్నయ ఠాకూర్ అనే కుమార్తె ఉన్నారు.
కాగా మందాకిని దంపతులు ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్నారు. వీరు ఒక టిబెట్ యోగా, హెర్బల్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. అయితే అప్పట్లో ఈమె డాన్ దావూద్‌తో కలిసి కనిపించింది. దీంతో ఆమె అతన్ని పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె వాటిని కొట్టిపారేసింది. ప్రస్తుతం ఈమె తన పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తోంది. అయితే భారతీయ చలన చిత్ర పరిశ్రమపై ఒక శ్రీదేవిలాగా ఈమె కూడా తనదైన శైలిలో ఓ ముద్ర మాత్రం వేసిందనే చెప్పవచ్చు.