India Vs Sri Lanka : దురదృష్టం వెంటాడితే అంతే.. తాడే పామై కరుస్తుంది అంటారు. అది సాక్షాత్తూ నిరూపితం అయింది. ఇండియన్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ విషయంలో జరిగింది చూస్తే.. సరిగ్గా మీరు కూడా అదే అంటారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. భారత్, శ్రీలంక జట్ల మధ్య బెంగళూరులో రెండో టెస్టు మ్యాచ్ శనివారం ప్రారంభమైన విషయం విదితమే. అందులో భాగంగానే భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్ చాలా చిత్రంగా ఔటయ్యాడు.
మయాంక్ అగర్వాల్‌కు శ్రీలంక బౌలర్ విశ్వ ఫెర్నాండో వేసిన ఓ బంతి కాళ్లకు తగిలింది. లంక ప్లేయర్లు అంపైర్‌కు ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. అయితే అంపైర్ దాన్ని నో బాల్‌గా ప్రకటించాడు. కానీ అవతలి ఎండ్‌లో ఉన్న మరో బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మను పట్టించుకోని మయాంక్ పిచ్ కు మధ్య భాగం వరకు వచ్చేశాడు. దీంతో అతను చూసుకోకుండా ముందుకు వచ్చినందుకు రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలోనే మయాంక్‌ను దురదృష్టం అలా వెంటాడింది.
కాగా మయాంక్ అగర్వాల్ అలా ఔట్ అయ్యే సరికి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతనిపై మీమ్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. వికెట్ల మధ్య సరిగ్గా రన్నింగ్ చేయడం కూడా చేతకాదని విమర్శిస్తున్నారు.
https://twitter.com/rishabhgautam81/status/1502575203766788096
ఇక భారత్ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాట్స్మెన్లలో శ్రేయాస్ అయ్యర్ జట్టును ఆదుకున్నాడు. 98 బంతుల్లో 10 ఫోర్లు 4 సిక్సర్లతో 92 పరుగులు చేసి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు దక్కేలా చేశాడు. ఇక శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పోరాడుతోంది. భారత బౌలర్లు విజృంభించడంతో లంకేయులు బెంబేలెత్తిపోయారు.