Mustard : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే వాటిల్లో ఆవాలు ఒకటి. వంటలను తయారు చేసేటప్పుడు వేసే తాళింపులో మనం కచ్చితంగా ఆవాలను వేస్తూ ఉంటాం. వంటల్లో ఆవాలను ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. ఆవాలను ఉపయోగించడం వల్ల కేవలం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని మాత్రమే మనకు తెలుసు. ఆవాలు మనకు అదృష్టాన్ని కూడా కలిగిస్తాయని మనలో చాలా మందికి తెలియదు. మనం కోరిన కోరికలన్నింటినీ తీర్చడంలో, మనం పట్టిందల్లా బంగారం అయ్యేలా చేసే శక్తి కూడా ఆవాలకు ఉంటుంది.
చెడును తగ్గించడంతోపాటు మనం కోరుకున్న వ్యక్తులను మన సొంతం అయ్యేలా చేయడంలో, శత్రువులను కూడా మిత్రులుగా చేయడంలో ఆవాలు మనకు ఉపయోగపడతాయి. ఆవాలను ఉపయోగించి మనపై జరిగిన చెడు ప్రయోగాలను కూడా తొలగించుకోవచ్చు. ఆవాలతో ఏవిధమైన పరిహారాన్ని చేయడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనకు నల్ల ఆవాలు, పసుపు ఆవాలు అనే రెండు రకాల ఆవాలు లభిస్తాయి. మనపై జరిగిన చెడు ప్రయోగాలను తొలగించడంలో పసుపు రంగు ఆవాలు చక్కగా పని చేస్తాయి. పసుపురంగు ఆవాలు దొరకనప్పుడు మనం మన ఇంట్లో ఉండే నల్ల రంగు ఆవాలను ఉపయోగించుకోవచ్చు. ఈ పరిహారాన్ని ఆదివారం, మంగళ వారం, శనివారం నాడు మాత్రమే చేయాలి. మిగతా రోజుల్లో ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఫలితం ఉండదు.
చెడు ప్రయోగాల వల్ల ఇబ్బందులు పడుతున్న వారు ఎడమ చేతిలో గుప్పెడు ఆవాలను తీసుకుని వాటిలో మూడు చిటికెల కుంకుమను వేయాలి. ఇప్పుడు ఎడమ చేత్తో నుదుటి భాగం నుండి కాలి బొటన వేలు వరకు శరీరాన్ని తాకుతూ పై నుండి కిందికి శరీరాన్ని టచ్ చేస్తూ వెళ్లాలి. ఇలా ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు చేసిన తరువాత తల చుట్టూ పదకొండు సార్లు తిప్పుకుని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. ఈ పరిహారాన్ని ఎవరికి వారే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనలో ఉండే చెడు అంతా పోయి మంచి జరుగుతుంది. అదే విధంగా మనకు దర దిష్టి తగిలిందని భావించినప్పుడు ఆవాలను, రాళ్ల ఉప్పును చేత్తో పట్టుకుని తల చుట్టూ అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు తిప్పుకుని తొక్కని ప్రదేశంలో వేయాలి. ఇలా చేయడం వల్ల నిమిషాల్లోనే నర దిష్టి ఫ్రభావం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.
మనలో ఉండే చెడును, దిష్టిని తొలగించడంలో ఆవాలు ఎంతగానో ఉపయోగపడతాయి. పసుపు రంగు ఆవాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. ఇంటికి దిష్టికి తగిలినా, ఇంట్లో పరిస్థితులు బాగాలేక పోయినా కూడా ఆవాలను చేత్తిలో పట్టుకుని ఇల్లంతా తిరిగి ఇంటికి దూరంగా విసిరేయాలి. ఇలా చేయడం వల్ల దిష్టి, దుష్ట శక్తుల వల్ల కలిగే సమస్యలు తగ్గడంతోపాటు మనలో, మన చుట్టూ ఉండే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి మనకు అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.