Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Tomato Capsicum : ఆలు ట‌మాటా క్యాప్సికంను ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..

D by D
December 25, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Tomato Capsicum : బంగాళాదుంప‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో ఇత‌ర కూర‌గాయ‌ల‌ను క‌లిపి కూర‌లు వండుతూ ఉంటాం. అందులో భాగంగా ఆలూ ట‌మాట క్యాప్సికం మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ ట‌మాట క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన ట‌మాటాలు – 2, ఉడికించిన బంగాళాదుంప‌లు – 2, త‌రిగిన క్యాప్సికం – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Tomato Capsicum masala curry recipe in telugu
Aloo Tomato Capsicum

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, సాజీరా – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – 5, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 3, బిర్యానీ ఆకు – 1, జీడిప‌ప్పు – 6, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బ‌రి పొడి – ఒక టేబుల్ స్పూన్.

ఆలూ ట‌మాట క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నువ్వులు త‌ప్ప మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన మిగిలిన ప‌దార్థాలు వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత నువ్వులు, ఎండు కొబ్బ‌రి పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించి చ‌ల్లారే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా పొడిగా చేసుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క్యాప్సికం ముక్క‌ల‌ను వేసి 2 నిమిషాల పాటు వేయించి వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మూత పెట్టి అవి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. టమాట ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత అందులో మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి.

దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు, వేయించిన క్యాప్సికం ముక్క‌లు, ఒక గ్లాస్ నీళ్లు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా దీనిపై కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ట‌మాట క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గ‌యాలు లేన‌ప్పుడు, వంట ఏం చేయాలో తోచ‌న‌ప్పుడు ఇలా ఆలూ ట‌మాట క్యాప్సికం మ‌సాలా క‌ర్రీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: Aloo Tomato Capsicum
Previous Post

Carrots For Hair : క్యారెట్‌తో ఇలా చేస్తే.. మీ జుట్టు రాల‌దు.. వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..

Next Post

Lemon Water For Weight Loss : నిమ్మ‌కాయ నీళ్ల‌ను ఇలా త‌యారు చేసుకుని రోజూ తాగితే.. కేజీల‌కు కేజీలు అల‌వోక‌గా త‌గ్గుతారు..

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!