Hair Growth Tip : ఒక చిన్న చిట్కాను ఉపయోగించి మనం మన జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల జుట్టు రాలడం, జుట్టు చిట్లడం, తెగిపోవడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుస్ప్రభావాలు కూడా ఉండవు. అదే విధంగా ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ఎక్కువగా సమయం పట్టదు. ఎక్కువగా ఖర్చు కూడా అవ్వదు. మన జుట్టును అందంగా, ఒత్తుగా, ధృడంగా మార్చే ఈ చిట్కా ఏమిటి…దీనిని ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం కేవలం నాలుగు పదార్థాలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ఒక తమలపాకును, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ మెంతులు, పావు లీటర్ కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒక గిన్నెలో వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాల్సి. తరువాత తమలపాకును ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తరువాత మెంతులను వేసుకోవాలి. ఈ నూనెను చిన్న మంటపై వేడి చేయాలి. తమలపాకు బాగా వేగి క్రిస్పీగా అయ్యే వరకు ఈ నూనెను వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ నూనెను పూర్తిగా చల్లారే వరకు అలాగే ఉంచాలి. నూనె చల్లారిన తరువాత వడకట్టి గాజు సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు బాగా పట్టించాలి. తరువాత నూనె చర్మంలోకి ఇంకేలా మర్దనా చేసుకోవాలి. దీనిని ఒక గంటపాటు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి. జుట్టు ఎక్కువగా రాలిపోతున్న వారు వారానికి ఇదే విధంగా వారానికి మూడు సార్లు చేయాలి.
ఈ విధంగా మన ఇంట్లో ఉండే పదార్థాలతో నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ నూనె తయారీలో ఉపయోగించిన ప్రతి పదార్థంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ నూనెను వాడడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా, ధృడంగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా నివారించబడుతుంది. అలాగే జుట్టు మృదువుగా, కాంతివంతంగా, మెత్తగా తయారవుతుంది. జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.