Garlic For Weight Loss : వెల్లుల్లి.. ఇది ఉండని వంటగది ఉండదనే చెప్పవచ్చు. ఎంతో కాలంగా మనం వంట్లలో వెల్లుల్లిని వాడుతూ ఉన్నాము. దాదాపు మనం తయారు చేసే ప్రతి వంటకంలో అలాగే పచ్చళ్లల్లో వెల్లుల్లి విరివిగా వాడుతూ ఉంటాము. వెల్లుల్లి కూరలకు చక్కటి రుచిని తీసుకు వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే వెల్లుల్లి మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా ఔషధంగా వెల్లుల్లిని ఉపయోగిస్తూ ఉంటారు. చాలా మంది పచ్చళ్లల్లో, తాళింపులో వేసిన వెల్లుల్లి ఏరి పక్కకు పెడుతూ ఉంటారు. కానీవెల్లుల్లి తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.
వైద్యులు కూడా వెల్లుల్లిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. వెల్లుల్లి తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అసలు వెల్లుల్లిని మనం ఎందుకు ఆహారంగా తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు మనల్ని ఇన్పెక్షన్ ల బారిన పడకుండా కాపాడడంలో దోహదపడతాయి. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తాన్ని పలుచగా చేయడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ ను కరిగించడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చేయడంలో, కూడా వెల్లుల్లి మనకు సహాయపడుతుంది.
అలాగే వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. శరీరంలో జీవక్రియల రేటును పెంచి సులభంగా బరువు తగ్గేలా చేయడంలో వెల్లుల్లి మనకు సహాయపడుతుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. మనలో చాలా మంది ఎముకలు బలహీనంగా మారడం, ఆర్థరైటిస్, ఎముకలు గుళ్లగా మారడం, ఎముకల సాంద్రత తగ్గడం ఇలా వివిధ రకాల ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఆహారంలో భాగంగా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక షుగర్ వ్యాధితో బాధపడే వారికి కూడా వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. రోజూ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
అంతేకాకుండా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఈ అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలను మనం కూడా పొందాలంటే వెల్లుల్లిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే వంటలల్లో వాడడానికి బదులుగా రోజూ ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను నేరుగా లేదా తేనెతో కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.