Paneer Health Benefits : పాలతో తయారు చేసే పదార్థాల్లో పనీర్ కూడా ఒకటి. పనీర్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పనీర్ తో పనీర్ మటర్ మసాలా, పనీర్ టిక్కా, పనీర్ కుర్మా, పనీర్ కబాబ్స్, పనీర్ కర్రీ ఇలా రకరకాల వంటకాలను అలాగే అనేక రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. పనీర్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే పనీర్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పాలు మన ఆరోగ్యానికి ఏ విధంగా అయితే మేలు చేస్తాయో పనీర్ కూడా అదే విధంగా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే పనీర్ తో చేసే వంటకాలు రుచిగా ఉన్నప్పటికి దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ పనీర్ ను కూడా మనం తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పనీర్ పోషకాల గని అని దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా దీనిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. మాంసాన్ని తినని వారు ఇలా పనీర్ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ లభిస్తాయి. కేవలం ప్రోటీన్స్ మాత్రమే కాకుండా పనీర్ లో క్యాల్షియం, పొటాషియం, విటమిన్ ఎ, కె, బి12 వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. పనీర్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కండపుష్టి, దేహధారుడ్యానికి వ్యాయామాలు చేసే వారు పనీర్ ను తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. పనీర్ ను తీసుకోవడం వల్ల శరీరం ధృడంగా తయారవుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.
అంతేకాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. పనీర్ ను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత క్యాల్షియం లభిస్తుంది. దీంతో ఎముకలు, దంతాలు ధృడంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా పనీర్ మనకు దోహదపడుతుంది. అంతేకాకుండా పనీర్ ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. థైరాయిడ్ తో బాధపడే వారు పనీర్ ను తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అలాగే జీర్ణసమస్యలు ఉన్న వారికి మాంసం త్వరగా జీర్ణం కాదు. అలాంటి వారు పనీర్ ను తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. నరీక్ త్వరగా జీర్ణం అవ్వడంతో పాటు దీనిని తీసుకోవడం వల్ల ఎటువంటి జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ విధంగా పనీర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కనుక దీనిని కూడా అందరూ తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.