Daily One Carrot : మనం క్యారెట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాము. క్యారెట్స్ తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని నేరుగా తినేస్తూ ఉంటారు. క్యారెట్స్ తో చేసిన వంటకాలు కూడా చాలా కమ్మగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వైద్యులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. అసలు మనం క్యారెట్స్ ను ఎందుకు ఆహారంలో భాగంగా తీసుకోవాలి.. వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్యారెట్ లో బీటా కెరోటీన్ ఉంటుంది. ఇది మన శరీరంలోకి వెళ్లిన తరువాత విటమిన్ ఎ మారుతుంది.
విటమిన్ ఎ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంలో, రేచీకటిని తగ్గించడంలో, కంటి సమస్యలు రాకుండా చేయడంలో క్యారెట్స్ మనకు ఎంతగానో సహాయపడతాయి. క్యారెట్స్ లో కెరోటినాయిడ్స్ తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడతాయి. ఫ్రీరాడికల్స్ నుండి చర్మాన్ని కాపాడడంలో, చర్మం యవ్వనంగా కనబడేలా చేయడంలో, చర్మంపై ముడతలను తగ్గించడంలో క్యారెట్స్ మనకు ఉపయోగపడతాయి. అలాగే క్యారెట్స్ ను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యారెట్ లో విటమిన్ బి6 ఉంటుంది. ఇది యాంటీ బాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో దోహదపడుతుంది. క్యారెట్స్ ను తీసుకోవడం వల్ల ఇన్పెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి.
అలాగే క్యారెట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారు క్యారెట్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. చాలా సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే వీటిలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో దోహదపడుతుంది. క్యారెట్ లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే క్యారెట్స్ ను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. క్యారెట్స్ లో విటమిన్ కె1, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి.
ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, ఆలోచనా శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. అలాగే క్యారెట్ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. వ్యాయామాలు చేసేటప్పుడు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే క్యారెట్స్ ను తీసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిని నమిలి తినడం వల్ల నోట్లో లాలాజలం ఎక్కువగా తయారవుతుంది. లాలాజలం ఎక్కువగా తయారవ్వడం వల్ల నోట్లో క్రిములు నశిస్తాయి. దీంతో చిగుళ్ల సమస్యలు, దంతాల సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా క్యారెట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని తప్పకుండా క్యారెట్స్ ను అందరూ ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.