Proteins : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో ప్రోటీన్ కూడా ఒకటి. కండరాల అభివృద్దిలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో ఇలా అనేక రకాలుగా ప్రోటీన్ మన శరీరానికి అవసరమవుతుంది. అయితే మనలో చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతూ ఉంటారు. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. శరీరంలో ప్రోటీన్ లోపించడం వల్ల మనం వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలా మందికి వారు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారని కూడా తెలియదు. శరీరంలో ప్రోటీన్ లోపించినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను బట్టి మనలో ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నామని అర్థం చేసుకోవాలి. శరీరంలో ప్రోటీన్ లోపం తలెత్తడం వల్ల మనలో కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్ లోపం కారణంగా కండరాలు బలహీనంగా తయారవుతాయి. ఇదికండరాల క్షీణతకు దారి తీస్తుంది. రోజు వారి పనులను కూడా మనం చేసుకోలేము. అలాగే ప్రోటీన్ లోపించడం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. జుట్టు పలుచడి, నిర్జీవంగా కనిపిస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. తరుచూ అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. ప్రోటీన్ లోపించడం వల్ల రోగనిరోధక శక్తి అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అలాగే ప్రోటీన్ మన శరీరంలో శక్తికి మూలం. ప్రోటీన్ లోపించడం వల్ల శక్తి తగ్గి మనం తరుచూ నీరసం, బలహీనత బారిన పడాల్సి వస్తుంది. చిన్న పనులకే మనం ఎక్కువగా అలిసిపోతూ ఉంటాము. అలాగే ప్రోటీన్ లోపించడం వల్ల మనం బరువు తగ్గిపోతాము లేదా అనుకోకుండా బరువు పెరిగిపోతాము. ఇక ప్రోటీన్ లోపంతో బాధపడే వారిలో ఎడెమా అనగా శరీర భాగాల్లో అక్కడక్కడ వాపు వస్తుంది. ప్రోటీన్ లోపించడం వల్ల శరీర భాగాల్లో ద్రవం నిలబడుతుంది.
దీంతో ఆ భాగాల్లో ప్రోటీన్ లోపం వస్తుంది. అలాగే గోర్లు పెలుసుగా మారిపోతాయి. గోర్లు ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయి. శరీరంలో తగినంత ప్రోటీన్ లేదు అని తెలియజేసే లక్షణాల్లో ఇది కూడా ఒకటి. అదే విధంగా శరీరంలో ప్రోటీన్ లోపించడం వల్ల కణజాల మరమ్మత్తు నెమ్మదిగా జరుగుతుంది. దీంతో గాయాలు మానడానికి సమయం ఎక్కువగా పడుతుంది. అలాగే ప్రోటీన్ లోపించడం వల్ల చర్మం పొడిగా తయారవుతుంది. చర్మంపై పొట్టు ఊడిపోతుంది. చర్మంపై ముడతలు ఎక్కువగా ఏర్పడతాయి. ఇక మహిళల్లో ప్రోటీన్ లోపించడం వల్ల హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతాయి. దీంతో నెలసరి సక్రమంగా రాదు. ఈ లక్షణాలను బట్టి మన శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడిందని మనం తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించడం అవసరం. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.