Fruits For Hemoglobin : మన శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ ఉండడం చాలా అవసరం. శరీరం ఆరోగ్యంగా, ధృడంగా ఉండాలంటే హిమోగ్లోబిన్ స్థాయిలు తగిన మోతాదులో ఉండడం చాలా అవసరం. తగినంత హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల మనం రక్తహీనత బారిన పడాల్సి వస్తుంది. రక్తహీనత కారణంగా మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఎల్లప్పుడూ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగిన మోతాదులో ఉండేలా చేసుకోవాలి. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఆహారాలను తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే పండ్లను తీసుకోవడం వల్ల మనం మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను చాలా సులభంగా పెంచుకోవచ్చు. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో ఆపిల్ పండ్లు మనకు ఎంతో సహాయపడతాయి. వీటిలో విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ ను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. దానిమ్మపండ్లల్లో ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దానిమ్మ పండ్లను తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అరటి పండ్లల్లో ఐరన్ , విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్త ఆరోగ్యం మెరుగుపడుతుంది. హిమోగ్లోబిన్ సంశ్లేషణ కూడా పెరుగుతుంది. నారింజ పండ్లల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో జామపండ్లు మనకు ఎంతో సహాయపడతాయి. వీటిలో విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జామపండ్లను తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల కూడా హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. వీటిలో విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది. తద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. పుచ్చకాయను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. పుచ్చకాయలో నీరు, విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
కనుక వీటిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరుగుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లల్లో కివీ కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ద్రాక్ష పండ్లల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కూడా హిమోగ్లోబిన్ ఎక్కువగా తయారవుతుంది. ఈ విధంగా ఈ పండ్లను తీసుకోవడం వల్ల మనం సహజ సిద్దంగా శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.