మన శరీరంలోని అనేక అవయవాలలో మెదడు ఒకటి. ఇది సమాచారాన్ని స్టోర్ చేసుకుంటుంది. అనేక జీవక్రియలను నిర్వర్తిస్తుంది. అందువల్ల మెదడును ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచేలా చూసుకోవాలి. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలి. అయితే కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
బి విటమిన్లు, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మెదడు యాక్టివ్‌గా మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకు గాను సిట్రస్ పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణ ధాన్యాలు, పుట్టగొడుగులు, వేరుశెనగలు, నువ్వులు, కోడిగుడ్లను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
బాదంపప్పు, జీడిపప్పు, అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వీటిని రోజూ తీసుకోవడం మంచిది.
చేపల్లోనూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మెదడును యాక్టివ్‌గా మారుస్తాయి. కనుక తరచూ చేపలను తీసుకోవాలి.
పాలకూర, క్యాబేజీ, పచ్చి బఠానీల వంటి ఆకుపచ్చని కూరగాయల్లో ఐరన్, విటమిన్లు ఇ, కె, బి9, ఫైటో న్యూట్రియెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
టమాటాల్లో లైకోపీన్ అనే పోషక పదార్థం ఉంటుంది. ఇది మెదడు కణాలను రక్షిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. కనుక రోజూ ఒక కప్పు టమాటా జ్యూస్ లేదా సూప్‌ను తాగితే మంచిది.