కోడిగుడ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కోడిగుడ్లను రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ప్రస్తుతం కౌజు పిట్టల గుడ్లకు కూడా ఆదరణ పెరుగుతోంది. వీటిని ప్రత్యేకంగా ఫామ్‌లలో పెంచుతున్నారు. దీంతో ఈ పిట్టల మాంసానికే కాదు, గుడ్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. అయితే కోడిగుడ్లు, కౌజు పిట్టల గుడ్లు.. రెండింటిలో ఏవి బలవర్ధకమైనవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కోడిగుడ్డుతో పోలిస్తే ఒక కౌజు పిట్ట గుడ్డులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. బరువు విషయానికి వస్తే ఒక కోడిగుడ్డు 3 కౌజు పిట్టల గుడ్లకు సమానం. కనుక మూడు కౌజు పిట్టల గుడ్లను తినాల్సి ఉంటుంది. అయితే పోషకాలు మాత్రం రెట్టింపు మొత్తంలో అందుతాయి. కౌజు పిట్టల గుడ్లలో ప్రోటీన్లు, కోలిన్, రైబో ఫ్లేవిన్, ఫోలేట్, పాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ ఎ, బి12, ఐరన్, ఫాస్ఫరస్, సెలీనియం అధికంగా ఉంటాయి.
కోడిగుడ్లతో పోలిస్తే పోషకాలు కౌజు పిట్టల గుడ్లలోనే ఎక్కువ. అందువల్ల కౌజు పిట్టలే మనకు బలవర్ధకమైన ఆహారం అని చెప్పవచ్చు. కనుక ఆ గుడ్లను తింటే కోడిగుడ్ల కన్నా రెట్టింపు మొత్తంలో పోషకాలను అందుకోవచ్చు. శక్తి కూడా లభిస్తుంది.