Apple : ఆపిల్ లో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని చెబుతూ ఉంటారు. అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఒక ఆపిల్ తింటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆపిల్‌లో డైటరీ ఫైబర్, పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది దానిపై తొక్కలో ఉంటుంది. చాలా మందికి నిద్ర సరిగా లేకపోవటం లేదా ఆలస్యంగా తినే అలవాట్ల కారణంగా జీర్ణ సమస్యలు ఉంటాయి కాబట్టి ఉదయం లేవగానే ఆపిల్ తినడం మంచిది. అందువల్ల ఉదయాన్నే ఆపిల్ తినడం వల్ల పేగుల్లో కదలికలు మెరుగ్గా ఉంటాయి.
ఆపిల్ లో ఉండే పెక్టిన్ లాక్టిక్ ఆమ్లాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అందులో ఉండే బ్యాక్టీరియా పెద్దపేగులో మెరుగ్గా పనిచేయటానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు సహాయం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్ లను వదిలించుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఆపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు ఉండుట వలన నోటిలో బ్యాక్టీరియాను తొలగించి నోటి ఆరోగ్యాన్ని రక్షించటంలో సహాయపడుతుంది.
ఆపిల్ లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. అదే రాత్రి లేదా సాయంత్రం యాపిల్స్ తింటే ఈ పండు మీకు వ్యతిరేకంగా మారుతుంది. అలాగే పేగుల పనితీరుపై లోడ్ ఎక్కువ అవుతుంది. అంటే రాత్రిపూట ఆపిల్ తింటే గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాక తెల్లవారుజామున తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తింటేనే మంచిది.