Old Coins : పాత కరెన్సీ నోట్లు, నాణేలను ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్ లో అమ్ముతూ లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి వాటిని విక్రయించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. సదరు నోట్లు, నాణేలు ఎంత పాతవి అయితే విలువ అంత ఎక్కువ వస్తోంది. ఇక మీ దగ్గర కనుక ఓ ప్రత్యేకమైన రూ.1 నాణెం పాతది ఉంటే.. దాంతో మీకు రూ. లక్షలు వస్తాయి.
మీ దగ్గర 1985లో ముద్రించబడిన రూ.1 నాణెం ఉండాలి. దానిపై ఆంగ్ల అక్షరం హెచ్ అని ముద్రించి ఉండాలి. ఈ నాణెం ఆన్‌లైన్‌లో రూ.2.50 లక్షలకు విక్రయించబడుతోంది. కనుక ఈ నాణెం ఉన్నవారు కాయిన్ బజార్ అనే వెబ్‌సైట్‌లో దాన్ని అమ్మకానికి పెడితే రూ.2.50 లక్షల మేర వస్తాయి.
ఆంగ్ల అక్షరం హెచ్ అని ముద్రించబడి ఉన్న నాణేలను చాలా తక్కువగా ముద్రించారు. వీటిని 1985, 1982, 1991 లలో ముద్రించారు. ఈ నాణెంపై ఒక వైపు మొక్కజొన్న కంకి ఉంటుంది. రెండోవైపు అశోక స్థూపం ఉంటుంది. ఈ నాణేలు గనుక మీ దగ్గర ఉంటే పైన చెప్పిన విధంగా రూ.2.50 లక్షలను పొందవచ్చు. ఇండియన్ కాయిన్ మిల్, కాయిన్ బజార్ అనే సైట్లలో పాత నోట్లు, నాణేలను కొనుగోలు చేస్తున్నారు. వాటిల్లో మీ దగ్గర ఉండే పాత నాణేలు, నోట్లను అమ్మి రూ.లక్షలు సంపాదించవచ్చు.